గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ డేటా బయటకు వస్తే? ఊహించటానికి సైతం ఇబ్బందిగా ఉండే ఈ వ్యవహారం ఇప్పుడు గుబులు రేపుతోంది. ఆధార్ సర్వర్ డేటా బయటకు రావటంపై ఇప్పటికే పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత గోపత్యను పక్కన పెట్టేసి వ్యక్తుల ఆధార్ నంబర్.. అడ్రస్.. ఇతర సమాచారాన్ని బహిరంగంగా అందరికి అందుబాటులో ఉండేలా కొన్ని వెబ్ సైట్లు తీసుకొచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి.
దీనీకి సంబంధించిన సందేహాల్ని తాజాగా తెలుగు రాష్ట్ర ఎంపీలైన జేసీ దివాకర్ రెడ్డి.. కొత్తపల్లి గీత తదితరులు ప్రశ్నించారు. వీరి ప్రశ్నలకు కేంద్ర సర్కారు ఇచ్చిన అధికారిక సమాచారం వింటే షాక్ తినాల్సిందే. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఆధార్ లీకేజ్ నిజమని ఒప్పుకోవటం గమనార్హం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన 210 వెబ్ సైట్లలో ఆధార్ డేటా ఇప్పటికి అందరికి అందుబాటులో ఉందని.. వాటిని తొలగించాలంటూ రెండు నెలల క్రితమే తాము ఆదేశాలు ఇచ్చినట్లుగా కేంద్రం వెల్లడించింది. విద్యా సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 210 వెబ్ సైట్లలో ఆధార్ డేటాను ప్రదర్శిస్తున్నారని.. అందులో లబ్దిదారుల పేర్లు.. చిరునామా.. ఆధార్ నెంబర్ తోపాటు ఇతర సమాచారం కూడా ఉందని పార్లమెంటు సాక్షిగా ఒప్పుకోవటం ఇప్పుడు ఆందోళనల్ని పెంచుతోంది.
కీలకమైన ఆధార్ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయన్నది ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆర్థిక నేరాలు జరుగుతాయోనని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం ఇస్తున్న భరోసాకు తగ్గట్లే నేరుగా ఆధార్ సర్వర్ ను హ్యాక్ చేయలేకపోవచ్చు కానీ.. సర్వర్లను అధికారికంగా ఉపయోగించే వెబ్ సైట్ల.. వాటి సర్వర్లను హ్యాక్ చేయొచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఏమైనా.. గోప్యంగా ఉండాల్సిన ఆధార్ డేటా బయటకు రావటం మాత్రం ఆందోళన కలిగించే అంశమే. దీనిపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.