ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణలో బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడ్డ వారికి స్థానికత అంశం పెద్ద అవరోధంగా మారింది. వాళ్లు ఏపీ వాసులా.? లేక తెలంగాణ వాసులా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీకి వెళితే ఉపాధి కరువు. ఇక్కడే ఉంటే స్థానికత సమస్యతో ఉద్యోగ - ఉపాధికి చిక్కులు. దీంతో ఇలా ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించిన ఏపీ వాసులకు తాజాగా కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది.
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకు ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో ప్రచురించింది.
ఇటీవల సీఎం జగన్ న్యూఢిల్లీ వెళ్లినప్పుడు ఏపీ వాసుల స్థానికత అంశంపై ప్రధాని మోడీకి వివరించినట్టు తెలిసింది. గడువును పొడిగించాల్సిందిగా జగన్ చేసిన విజ్ఞప్తి మేరకు మోడీ స్వయంగా హోంశాఖకు స్థానికతను పెంచాలని సూచించారట.. ఈ మేరకు తాజాగా గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.