ఏపీ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఎప్పుడంటే.. కేంద్రం క్లారిటీ

Update: 2019-10-18 04:37 GMT
ఏపీ ఒరిజిన‌ల్ బ్రాండ్ ఇమేజ్‌ను నిలిపేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సాయం చేయ‌నుందా ? గ‌తంలో ఏపీకి దేశ‌వ్యాప్తంగా ఉన్న పేరు ప్ర‌ఖ్యాతుల‌ను పాడు చేయ‌కుండా.. అలాగే కొనసాగించాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుందా..?  అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది.. వినిపించ‌డ‌మే కాదు.. ఏకంగా కేంద్రం కూడా ఆ వైపు నిర్ణ‌యం తీసుకుంది కూడా.. అయితే కేంద్రం ఏ విష‌యంలో ఏపీకి సాయం చేస్తుంది.. అంటే మీకు ముందుగా గుర్తుకు రావాల్సింది ఏపీ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఎప్పుడో మీకు తెలుసా.. అంటే ఏపీ ప్ర‌జ‌లంతా త‌డుముకోవాల్సిందే.

ఏపీ అవ‌త‌ర‌ణ దినోత్సవం ఎప్పుడు న‌వంబ‌ర్ 1 - జూన్ 2 ఈ రెండు తేదీల్లో ఏదో ఎవ్వ‌రికి అంతు చిక్క‌కుండా ఉండిపోయింది.. అందుకే కేంద్రం ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టింది.. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చొర‌వ‌కు కేంద్రం ప్ర‌భుత్వం రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవంకు ప‌చ్చ‌జెండా ఊపింది. దీంతో ఇంత‌కాలం మ‌రుగున ప‌డిన ఏపీ రాష్ట్ర అవత‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకునేందుకు మార్గం సుగమం అయింది.  రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు.

దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఏపీ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కాగా, దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు కూడా ఆ విభజన తేదీ రోజునే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని తెలిపింది. అంటే ఏపీలో ఇక ముందు నుంచి పాత తేదీనే అవ‌త‌ర‌ణ దినోత్సవం జ‌రుపుకోనుంది.
Tags:    

Similar News