విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రంలో కదలిక వచ్చిందని టీడీపీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. ఏ క్షణంలోనైనా జోన్ ఏర్పాటుపై ప్రకటనకు సిద్ధంగా ఉండాలంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ కు బీజేపీ అధిష్టానం నుంచి సమాచారం అందినట్లు చెప్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సుజనా చౌదరి చర్చలు జరుపుతుండడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. విశాఖ కేంద్రంగా గుంతకల్ - గుంటూరు - విజయవాడలతొ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయొచ్చని వినిపిస్తోంది. ప్రస్తుతం వాల్తేర్ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉంది. దీంతో ఒడిశా నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ నుంచి వ్యతిరేకత లేకుండా ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రస్తుత వాల్తేర్ డివిజన్ లోని సింహభాగం ఒడిశాకు వదిలేసేలా ఏపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ డివిజన్ మూడు రాష్ర్టాల్లో విస్తరించి ఉంది. ఏపీతో పాటు ఒడిశా - చత్తీస్ గఢ్ వరకు వాల్తేరు డివిజన్ ఉంది. అలాగే.. ఏపీలోని కొద్ది ప్రాంతం ఒడిశాలోని ఖుర్దా డివిజన్ లో ఉంది. దీంతో ఆ ప్రాంతం వాల్తేరులో కలిపి.. ఏపీకి చెందని మిగతా ప్రాంతమంతా ఒడిశాకు వదిలేసేలా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ చర్చల అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ - రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇది క్లిష్టమైన అంశం కావడం - ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు బలంగా ఉండడంతో దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని చెప్పినట్లు తెలిసింది. అయితే... రైల్వే జోన్ పై మార్చి 5 లోపు ప్రకటన రావొచ్చని కూడా తెలుస్తోంది. ఈలోగా ఈస్ట్ కోస్ట్ జోన్ జనరల్ మేనేజర్ ఉమేశ్ సింగ్ ను రైల్వే మంత్రి వివరాలు కోరనున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ప్రస్తుత వాల్తేరు డివిజన్ లోని ఏపీయేతర ప్రాంతాలనన్నిటినీ వదులుకుంటే సుమారు 70 శాతం ప్రాంతం వదులుకున్నట్లవుతుంది. అలాంటప్పుడు ఆల్రెడీ దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ - గుంటూరు - గుంతకల్ డివిజన్లను కూడా కలిపి విశాఖ జోన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేకంగా లాభమేమీ ఉండదు. కేవలం సెంటిమెంటు కాపాడుకోవడం తప్ప.