సెంటర్ ఎంటరైంది... సీనెలా మారుతుందో..?

Update: 2015-06-26 10:44 GMT
రాను రానంటూనే చిన్నదీ రాములోరి గుడికొచ్చె చిన్నది అన్న పాట తెలిసే ఉంటుంది... ఇప్పుడు కేంద్రం వైఖరి కూడా అలాగే ఉంది. ఏపీ, తెలంగాణల మధ్య గొడవలపై మేం జోక్యం చేసుకోబోమని చెప్పుకొస్తున్న కేంద్రం చివరకు ఈ విషయంలో తలదూర్చింది. మేం జోక్యం చేసుకోబోమంటూ పదేపదే చెప్పినా ఇప్పుడు మాత్రం సీన్లోకి ఎంటరైంది. అయితే.. ఈ పని ముందే చేసుంటే పరిస్థితి ఇంత అధ్వానంగా మారేదికాదన్న వాదన వినిపిస్తోంది.

రాష్ట్రాల మధ్య గొడవల్లో మేం తలదూర్చబోమని.. వాటికి దూరంగా ఉంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్ ను పిలిచి చర్చించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే... ఈ పని ముందే చేయాల్సింది. పరోక్ష మార్గంలోనో.. లేకుంటే నేరుగా ఇద్దరు సీఎంలనూ కూర్చోబెట్టో చర్చలు జరిపితే ఇంత రచ్చ జరిగేది కాదు.

గవర్నరు తాజా పర్యటనలో కేంద్ర హోం శాఖ అధికారులు దాదాపు రెండు గంటలపాటు ఆయనతో చర్చలు జరిపారు. అయితే... కేంద్రం, గవర్నరు మధ్య చర్చల సంగతి పూర్తిగా బయటపడనప్పటికీ ఇందులో రాజకీయ కోణమే ఉందని తెలుస్తోంది.
Tags:    

Similar News