భారత్‌లో నల్లధనం సమస్య ఈనాటిది కాదు.. దశాబ్దాలుగా పోగవుతున్న నల్లధనం కొండల్లా పేరుకుపోయింది. అంటే.. మోడీ అనుకుంటున్నట్లుగా అదంతా నగదు రూపంలోనే ఉంటుందని లేదు.. వాటాలు - షేర్లు - స్థిరచరాస్తుల రూపంలో ఉంది. పన్నుల ఎగవేతతో వ్యాపారులు - పారిశ్రామికవేత్తలు - రాజకీయవేత్తలు పెద్దెత్తున నల్లధన నిల్వల్ని వెనకేశారు. వీరంతా ఈ సొమ్ముతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతున్నారు. పెద్దెత్తున స్థిరచరాస్తుల్ని కూడబెడుతున్నారు. దీన్ని నివారించేందుకే మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రక్రియకు ఉపక్రమించారు. ఒకేసారి దేశంలో మారకంలో ఉన్న 14.5 ల క్షల కోట్ల విలువైన రూ. 500 - 1000నోట్లను రద్దు చేసేశారు. వీటికి బదులుగా అంచెలంచెలుగా కొత్తనోట్లను ప్రవేశపెడుతున్నారు. మరోవైపు నగదు రహిత లావా దేవీల్ని దేశంలో ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రజలకు తీవ్రఇబ్బందుల్ని కొనితెచ్చింది. అయినా భవిష్యత్ లో నల్లధన కుబేరులు అంతరిస్తారు.. పన్నులు సక్రమంగా జమౌతాయి.. దీంతో దేశం ఆర్ధికంగా ముందడుగేస్తుందన్న విశ్వాసంతో వీటిని భరించేందుకు ప్రజలు సంసిద్దులయ్యారు. ఈలోగానే కార్డుల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం కొన్ని రాయితీల్ని కూడా ప్రకటించింది. కార్డులపై పెట్రోలు - డీజిల్ ఉత్పత్తుల కొనుగోళ్ళపై 0.75శాతం రాయితీలిచ్చింది. అయితే ఇవేవీ కొనుగోలుదార్లను ఆకర్షించలేదు. ముఖ్యంగా నల్లధనవంతులను ఇలాంటి పథకాలేవీ ఆకట్టు కోలేదు.
నల్ల వ్యాపారులు - వడ్డీ వ్యాపారులు - క్రికెట్ బుకీలు - రియల్ ఎస్టేట్ నిర్వాహకులు అంతా కార్డుల కంటే నగదు వినియోగానికే ప్రయారిటీ ఇస్తున్నారు. క్యాష్ లెస్ వల్ల ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనం కంటే నగదు వాడకం వల్ల తమకు కలిగే ప్రయోజనం ఎక్కువని గుర్తించి ఆ పని చేస్తున్నారు.
పైగా పెట్రోల్ - డీజిల్ వంటి ఉత్పాదనలన్నీ 30శాతం పన్ను అనం తరం కొనుగోలు చేస్తున్నాం.. అప్పటికే పన్ను కట్టిన వస్తువులపై కొనుగోలుకు 0.75శాతం రాయితీ కోసం ఆశపడడం వేస్టన్నది చాలామంది అభిప్రాయం. దీంతో నల్లకుబేరులు - వ్యాపారులెవరూ కార్డుల ద్వారా కొనుగోలుకు ముందుకు రావడంలేదు. విలాసవంతమైన హోటళ్ళలో బిల్లులు - బార్ లలో చెల్లింపులకు కూడా కార్డుల వినియోగానికి ఆసక్తి చూపడంలేదు. కేవలం చిల్లర నోట్లు పొందలేని పేదలు - సాధారణప్రజలు మాత్రమే కార్డులపై కొనుగోలుకు ముందుకొస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/