చిదంబరం విషయంలో కేంద్రం పట్టుదల ఇదే!

Update: 2019-08-22 11:37 GMT
కేంద్ర మాజీ హోం - ఆర్థిక మంత్రి చిదంబరం చాప్టర్ క్లోజ్ చేసే దిశగా కేంద్రం పట్టుదలగా ఉన్నట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.  తాజాగా ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రాకేష్ అహుజాపై బదిలీ వేటు వేసింది.

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తి లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడ్డారని అభియోగాల మేరకు నిన్న చిదంబరంను అరెస్ట్ చేశారు సీబీఐ - ఈడీ అధికారులు. ఏకంగా 305 కోట్ల విదేశీ పెట్టుబడులు స్వీకరించేందుకు వీలుగా చిదంబరం అనుమతులు ఇచ్చి ముడుపులు తీసుకున్నట్టు వీరిపై సీబీఐ అభియోగాలు మోపింది.

అయితే ఈ  చిదంబరం కేసును విచారిస్తున్న ఈడీ అధికారుల్లో కాంగ్రెస్ హయాంలో పనిచేసిన ఈడీ అధికారి అహుజాను తాజాగా కేంద్రం బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈయన  చిదంబరానికి మేలు చేసేలా.. లీకులు ఇస్తారేమోనన్న  అనుమానం మేరకే ఈ బదిలీ చేశారని సమాచారం.  అహుజాను తాజాగా ఢిల్లీ పోలీస్ విభాగంలోకి బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

దీన్ని బట్టి చిదంబరం కేసు విషయంలో కేంద్రం ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతోంది. చిదంబరంను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా  ఉచ్చు బిగించాలనే కృతనిశ్చయంతోనే విచారిస్తున్న అధికారులను కూడా బదిలీ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
   

Tags:    

Similar News