వ్యాక్సిన్ విషయంలో ఆ కంపెనీలు చేతులు ఎత్తేశాయా?

Update: 2021-06-27 13:30 GMT
భారత దేశంలో వ్యాక్సినేషన్‌ పక్రియ విషయంలో సుప్రీం కోర్టు మొదటి నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. కేంద్రం నుండి ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ కు సంబంధించిన అఫిడవిట్ సుప్రీం కోర్టు తీసుకుంటూ ఉంది. కొన్ని వారాల ముందు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ లో వచ్చే ఆగస్టు నుండి డిసెంబర్ వరకు దేశంలో మొత్తంగా 216 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం అవుతుందని పేర్కొంది. ఆ మొత్తం డోసులను ఈ ఏడాదిలోనే సంస్థల నుండి తీసుకుంటున్నామని.. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పేర్కొంది. కాని తాజా అఫిడవిట్‌ లో మాత్రం ఏకంగా 81 కోట్ల డోసులను తగ్గించి చూపించింది.

కేంద్రం తాజా అఫిడవిట్‌ లో ఆగస్టు నుండి డిసెంబర్‌ మద్యలో 135 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ను అందుబాటులో ఉంచబోతున్నట్లుగా పేర్కొంది. గతంలో 216 కోట్ల డోసులను తయారు చేయిస్తున్నట్లుగా పేర్కొన్న కేంద్రం ఈ ఏడాది చివరి వరకు అందరికి వ్యాక్సిన్‌ ను ఇస్తామని చెప్పడం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం మాట మార్చింది. ఇప్పుడు ఎందుకు ఆ సంఖ్యను తగ్గించిందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సుప్రీం కోర్టులో తాజాగా తెలియజేసిన దాని ప్రకారం ఈ ఏడాది చివరి వరకు ఇండియాలో వ్యాక్సినేషన్‌ పక్రియ పూర్తి అవ్వదు. అందుకు కారణం వ్యాక్సిన్‌ ను పూర్తి స్థాయిలో కేంద్రం సిద్దం చేయలేక పోయింది.

వ్యాక్సిన్ ను కేంద్రం సిద్దం చేయలేక పోవడంకు కారణం ముందుగా ఒప్పందం చేసుకున్న సంస్థలు చేతులు ఎత్తేయడం అంటున్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం కోవిషీల్డ్‌ 77 కోట్లు, కోవాగ్జిన్‌ 55 కోట్లు, బయోలాజికల్‌ ఇవ్యాక్స్‌ 30 కోట్లు, జైడస్ 5 కోట్లు, నొవావ్యాక్స్‌ 20 కోట్లు, భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ 10 కోట్లు జెనోవా బయోఫార్మా 6 కోట్లు స్పూత్నిక్‌ వి 15.06 కోట్ల డోసులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కాని వీటిలో కొన్ని సంస్థలు వ్యాక్సిన్‌ ను అందించలేక పోవడంతో పాటు కొన్ని సంస్థలు గత నెలలో చెప్పినన్ని డోసులు ఇవ్వలేక పోతున్నాయి.

తాజా అఫిడవిట్‌ లో కేంద్రం కోవిషీల్డ్‌ 50 కోట్ల డోసులు, కోవాగ్జిన్‌ 40 కోట్ల డోసులు, బయోలాజికల్‌ ఇవ్యాక్స్ 30 కోట్లు, జైడస్‌ 5 కోట్లు, స్పుత్నిక్ వి 10 కోట్ల డోసులు ఇవ్వబోతున్నాయి. ఇతర కంపెనీలు కేంద్రంతో ఒప్పందంను రద్దు చేస్తున్నాయని తెలుస్తోంది. అందుకే గత నెలలో 216 కోట్ల డోసులను ఈ ఏడాది చివరి వరకు ఇస్తామన్న కేంద్రం ఇప్పుడు మాత్రం 135 కోట్ల డోసులను మాత్రమే ఇవ్వగలని తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా దాదాపుగా 93 నుండి 95 కోట్ల జనాలు 18 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. వారందరికి వ్యాక్సిన్‌ అందించడం ఈ ఏడాదికి సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News