చంద్రబాబుకు మళ్లీ నో చెప్పేసిన కేంద్రం

Update: 2017-11-12 05:58 GMT
ఏపీ సీఎం చంద్రబాబు మాటకు కేంద్రంలో విలువన్నది లేకుండా పోతోంది. ఆయన ప్రతిపాదనలను కేంద్రం తీసి బుట్టలో పడేస్తోంది. ఒక్కోసారి ఇదేంటి అదేంటి అని ప్రశ్నల వర్షం కురిపించి డిఫెన్సులో పడేస్తుంది. ఏపీ డీజీపీ నియామకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను కేంద్రం ఇప్పటికే ఒకసారి తిప్పి పంపిన సంగతి తెలిసిందే. అయితే.. అదే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం మరోసారి పంపగా ఈసారీ అది గోడకు కొట్టిన బంతిలా వెనక్కొచ్చిందట.
    
ఏపీ మొదట పంపిన జాబితాలో ఉన్న పేర్లతోనే మళ్లీ రెండోసారీ జాబితా పంపించారు. దీంతో కేంద్రం ఆగ్రహిస్తూ దాన్నీ వెనక్కు తిప్పి పంపించింది. రమణమూర్తి - మాలకొండయ్య - సాంబశివరావులు పదవీ విరమణ కాలం దగ్గరలోనే ఉన్నందున వారి పేర్ల స్థానంలో వేరే అధికారుల పేర్లు పంపాలంటూ కేంద్ర హోంశాఖ సూచిస్తూ ఆ లిస్ట్‌ ను వెనక్కు పంపింది. మరోవైపు డీజీపీ రేసులో ఉన్న వారికి అనుకూలంగా - వ్యతిరేకంగా మంత్రులు - ఐపీఎస్‌ లు ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది.
    
సాంబశివరావు - ఆర్పీ ఠాకూర్ - గౌతమ్ సవాంగ్‌ లకు అనుకూలంగా పలువురు నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా కొందరు అధికారులు కూడా ఇదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇన్‌ చార్జ్ డీజీపీ సాంబశివరావు కూడా ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రెండోసారి కూడా లిస్ట్‌ ను కేంద్రం తిరస్కరించడంతో చంద్రబాబు ఇక ప్రయత్నం మానుకుని గౌతమ్‌ సవాంగ్‌ ను కొత్త డీజీపీగా నియమించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.
Tags:    

Similar News