మ‌రో ప్రాజెక్టుకు మోడీ హ్యాండిస్తున్నారా బాబు?

Update: 2017-12-25 11:12 GMT
మౌనం అన్నిసార్లు వ‌ర్క్ వుట్ కాదు. ఈ విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబు ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే అంత మంచిది. లేకుంటే ఆయ‌న పుట్టె మునిగిపోవ‌టం ఖాయం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భారీ హామీలు ఇచ్చి.. త‌న చేతికి అధికారం వ‌స్తే చాలు.. ఏదేదో జ‌రిగిపోతుంద‌ని.. అమ‌రావ‌తిని నిర్మించేస్తాన‌న్న‌ట్లుగా చెప్పిన మాట‌లు.. ఇచ్చిన హామీల‌తో పాటు.. మోడీ మీద ఉన్న న‌మ్మ‌కంతో ఏపీ ప్ర‌జ‌లు గుడ్డిగా ఓట్లు వేశారు.

విభ‌జ‌న జ‌రిగిన తీరును త‌న‌ను ఎంతో బాధించింద‌న్న విష‌యాన్ని మోడీ చెప్ప‌ట‌మే కాదు.. ఢిల్లీని త‌ల‌పించే రాజ‌ధానిని ఏపీకి ఇస్తామంటూ సీమాంధ్ర‌ ప్ర‌జ‌ల‌కు చాలానే ఆశ‌లు క‌ల్పించారు. ప‌వ‌ర్లోకి వ‌చ్చి దాదాపు నాలుగేళ్లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ చేసిందేమీ లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల గురించి గ‌ట్టిగా అడిగే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోతున్నార‌న్న మాట వినిపిస్తోంది.

కేంద్రం నుంచి నిధులు తీసుకురావ‌టంలోనూ.. ప్రాజెక్టుల‌కు క్లియ‌రెన్సులు తెచ్చుకోవ‌టంలోనూ అదే ప‌నిగా ఫెయిల్ అవుతున్నారు చంద్ర‌బాబు. మొన్న‌టికి మొన్న పోల‌వ‌రం ఇష్యూలో ర‌చ్చ ర‌చ్చ అయి.. ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురి అవుతుందేమోనన్న ఆలోచ‌న‌తో ప‌నుల‌కు పాక్షికంగా అనుమ‌తులు ఇవ్వ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ప్ర‌యోజనాల్ని మ‌రోసారి దెబ్బ తీసేలా మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి.. సీమాంద్ర ప్రాంతానికి రోడ్డు క‌నెక్టివిటీ కోసం భారీ రోడ్డు ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అమ‌రావ‌తి నుంచి అనంత‌పురం జిల్లా వ‌ర‌కూ ఎక్స్ ప్రెస్ హైనేను నిర్మిస్తామ‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే.. సీమ‌కు.. కోస్తాకు మ‌ధ్య క‌నెక్టెవిటీ పెరిగిపోవ‌ట‌మే కాదు.. ర‌వాణా స‌దుపాయం భారీగా పెరుగుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్త‌మైంది.

ఈ ఎక్స్ ప్రెస్ హైవే కోసం దాదాపు రూ.25వేల కోట్లు వ్య‌య‌మ‌వుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప‌నుల్లో భాగంగా భారీ ఎత్తున భూమిని సేక‌రించాల్సి ఉంటుంది. భూసేక‌ర‌ణ కోస‌మే దాదాపు 2వేల కోట్ల రూపాయిలు ఖ‌ర్చు అవుతుంద‌న్న అంచ‌నా ఉంది. వంద‌లాది హెక్టార్ల భూమిని సేక‌రించాల్సి రావ‌టం.. అందులో అట‌వీ.. వ్య‌వ‌సాయ‌.. నివాసిత ప్రాంతాలు ఉండ‌టంతో.. భూసేక‌ర‌ణ ఖ‌ర్చును ఏపీ స‌ర్కారు భ‌రించాల‌ని కేంద్రం కోరుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. ఏపీకి భారీగా న‌ష్టం వాటిల్ల‌టం ఖాయం.

వాస్త‌వానికి ఇప్ప‌టికే ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు ప‌నులు మొద‌లు కావాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి. భారీ ప్రాజెక్టుల‌ను ఘ‌నంగా ప్ర‌క‌టించ‌టం.. త‌ర్వాత ప‌త్తా లేకుండా పోవ‌టం కేంద్రానికి ఒక అల‌వాటుగా మారింది. కీల‌క ప్రాజెక్టుల ప‌నులు ఆల‌స్యం అవుతున్న తీరును గుర్తించి.. ఎప్ప‌టికిప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాబు స‌ర్కారు విఫ‌లం కావ‌టంతో.. ఈ ప్రాజెక్టు ప‌నులు మొద‌లు కావ‌టం లేదు.

భార‌త మాల నిబంధ‌న‌ల ప్రకారం ఒక రాష్ట్రంలో ఏడాదికి 200 కిలోమీట‌ర్ల ప‌నులు మాత్ర‌మే చేప‌ట్టాల్సి ఉంది. అదే నిజ‌మైతే.. ఎక్స్ ప్రెస్ హైవే కోసం 557 కిలోమీట‌ర్లు రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం  ప్రాజెక్టు పూర్తి అయ్యేస‌రికి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. అదే జ‌రిగితే.. ఏపీకి భారీ న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంది. రాష్ట్రానికి చేటు క‌లిగించే రూల్స్ ను మార్చేసి త్వ‌రిత‌గ‌తిన ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రింటం ఏపీకి న‌ష్టం వాటిల్లేలా చేస్తుంది. ఈ విష‌యాన్ని బాబు ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది.
Tags:    

Similar News