నల్లధనంపై పోరులో భాగంగా ఐటీశాఖను పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈసారి కొత్తగా 2.8 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దానికోసం కసరత్తులు మొదలయ్యాయి. నల్లధనంపై పోరులో భాగంగా ఐటీశాఖను పటిష్టం చేయాలని డిసైడ్ అవడంతో ఈ కొత్త ఉద్యోగాల్లో ఎక్కువ భాగం ఇన్ కమ్ ట్యాక్స్ - కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లలోనే భర్తీ చేయనున్నారు. దీంతో ఈ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నది.
ప్రస్తుతం ఐటీ డిపార్ట్ మెంట్ లో 46 వేల మంది ఉండగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య 80 వేలకు పెరగనుంది. ఇక జీఎస్టీ అమలు చేయడానికి సిద్ధమవుతున్న కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు కొత్తగా 41 వేల కొలువులు రానున్నాయి. ప్రస్తుతం ఆ శాఖలో 50600 మంది ఉద్యోగులు ఉండగా.. వచ్చే ఏడాది ఆ సంఖ్య 91700కు పెరగనుంది. ఇప్పటికే 13 లక్షల ఉద్యోగాలతో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రైల్వే శాఖలో కొత్తగా ఎలాంటి ఉద్యోగాలు ఉండబోవని బడ్జెట్ లోనే కేంద్రం స్పష్టం చేసింది. ఇక విదేశాంగ శాఖపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టిసారిస్తుండటంతో ఆ శాఖలో కొత్తగా 2 వేల కొలువులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాచార శాఖలోనూ కొత్తగా రెండు వేలకుపైగా ఉద్యోగాలు రానున్నాయి. కేబినెట్ సెక్రటేరియట్ లో ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్య 921 నుంచి వచ్చే ఏడాది 1218కు చేరనుంది.
మొత్తంగా...ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొలువులు భర్తీ చేయకపోవడంతో నారాజ్ అవుతున్న విద్యార్థులు స్థానిక పాలకులు వేసే ఉద్యోగాలపై కాస్త ఆసక్తి తగ్గించుకొని జాతీయ కొలువులకు సిద్ధం అవడం ద్వారా ఏడాది కాలంలోనే సెటిల్ అవ్వచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/