మద్యం విక్రయాలకు 'గ్రీన్' సిగ్నల్
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపుగా నెల రోజులకు పైగా మందు బాబుల గొంతు తడవట్లేదు. ఆదివారంతో రెండో దశ లాక్ డౌన్ ముగియనుందని, ఇక సోమవారం నుంచి మందు దొరకడం ఖాయమేనన్న భావనతో ఉన్న మందుబాబులకు కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 3తో రెండో దశ లాక్ డౌన్ ముగిసినా... 4 నుంచి 17 దాకా మూడో విడత లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లుగా శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ సంచలన ప్రకటనలోనూ కేంద్రం మందుబాబులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. శనివారం నుంచే మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పిన కేంద్రం... అందులో ఓ మెలిక పెట్టేసింది. కేవలం గ్రీన్ జోన్లలోనే మద్యం విక్రయాలకు అనుమతిస్తున్నట్లుగా చెప్పిన కేంద్రం... మందుబాబులకు కొంత తీపి, కొంత చేదు అన్న రీతిలో తనదైన శైలి ప్రకటనను విడుదల చేసింది.
గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేసిన కేంద్రం.. మద్యం విక్రయాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదే సమయంలో మద్యం విక్రయాల సందర్భంగా భౌతిక దూరం పాటింకచ తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. వైన్ షాపుల వద్ద ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ మందుబాబులు మద్యాన్ని కొననుగోలు చేయాల్సి ఉంటుందట. ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు అయ్యేలా చూసే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కూడా కేంద్రం తేల్చి చెప్పింది. మద్యం కొనుగోలు సందర్భంగా మందుబాబులు భౌతిక దూరం పాటించకుంటే ప్రమాదమేనన్న రీతిలో కేంద్రం ఈ నిబంధనను పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... కరోనా వ్యాప్తి ఉన్న జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా, కరోనా వ్యాప్తి తగ్గుతున్నట్లుగా సూచనలు కనిపిస్తున్న జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో మద్యం విక్రయాలను కేవలం గ్రీన్ జోన్లకు మాత్రమే పరిమితం చేస్తే.. రెడ్, ఆరెంజ్ జోన్లకు చెందిన మందుబాబులు మద్యం కోసం గ్రీన్ జోన్లపై పడే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకంటే... రెడ్ జోన్ లను ఎలాగోలా దాటుకుని వెళ్లే మందుబాబులు... ఆరెంజ్, గ్రీన్ జోన్లలో దాదాపుగా స్వేఛ్ఛగానే తిరిగే అవకాశాలున్నాయి. మరి ఈ తరహా ప్రమాదాన్ని ఎలా అరికడతారన్నది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా కరోనా కారణంగా నెలకు పైగా మూతపడ్డ మద్యం షాపులు తెరచుకోనుండటం... అది గ్రీన్ జోన్లకే పరిమితమైనా మందుబాబులకు శుభవార్తగానే చెప్పాలి.