ఏపీ స్థానికతకు రాష్ట్రపతి రాజముద్ర వేసేశారు

Update: 2016-06-10 07:00 GMT
కీలకమైన ఏపీ స్థానికత అంశంపై స్పష్టత వచ్చేసింది. ఇంతకాలం ఏపీ సర్కారు చెబుతున్నట్లే.. 2017 జూన్ 2 మధ్య కాలంలో హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్లే  ఉద్యోగుల స్థానికత ఫైల్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో.. ఏపీకి ఇప్పటికే తరలి వెళ్లిన.. తరలి వెళ్లే ఉద్యోగులకు స్థానికతకు ఎలాంటి ఢోకా ఉండదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్లే ఉద్యోగుల స్థానికత మీద చాలానే అభ్యంతరాలు ఉన్నాయి.

హైదరాబాద్ తరలి వెళ్లే ఉద్యోగుల కారణంగా వారి కుటుంబ సభ్యులకు విద్య.. ఉద్యోగ సంబంధమైన స్థానికత అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వీలుంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2 మధ్య కాలంలో హైదరాబాద్ నుంచి తరలివెళ్లే ఉద్యోగులకు స్థానికతను నిర్ణయిస్తూ కేంద్రం ఆమోదించిన ఫైల్ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో.. ఇది అధికారిక చట్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్లే ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థానికతకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. రాష్ట్రపతి ఆమోదముద్ర నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్లే ప్రక్రియ మరింత జోరు అందుకునే వీలుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News