చాయ్‌వాలాకు బీజేపీ టికెట్‌.. ఎక్క‌డంటే!

Update: 2022-10-21 07:45 GMT
చాయ్ వాలా.. పాలిటిక్స్‌.. ఈ మాట అన‌గానే చ‌టుక్కున గుర్తుకు వ‌చ్చే పేరు.. ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఎందుకంటే.. ఆయ‌న చాయ్‌వాలాగానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని.. గ‌తంలో టీ అమ్ముకుని జీవనం సాగించాన‌ని చెప్పుకొన్నారు. సో.. బీజేపీలో చాయ్‌వాలా పాలిటిక్స్ ఇంట్ర‌స్ట్‌. ఇక‌, ఇప్పుడు .. తాజాగా మ‌రో చాయ్ వాలాకు.. బీజేపీటికెట్ ఇచ్చింది. హిమాచల్‌ప్రదేశ్లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఇక్క‌డి శిమ్లా అర్బన్  అసెంబ్లీ స్థానంలో చాయ్‌వాలా సంజయ్‌ సూద్  త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అంతేకాదు.. ఇప్ప‌టికి నాలుగుసార్లు గెలిచిన మంత్రి సురేశ్ను పక్కనబెట్టి మ‌రీ చాయ్ వాలా సంజయ్‌కు అవకాశం కల్పించడం గమనార్హం. మ‌రోవైపు.. హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చాలా మంది కొత్తవారికి అవకాశం కల్పిస్తోంది.

సంజయ్‌.. శిమ్లాలో చాయ్‌ దుకాణం నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి సురేశ్‌ భరద్వాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయన నాలుగు సార్లు గెలిచినప్పటికీ.. ఈసారి ఆయనను పక్కనబెట్టి సంజయ్‌కు అవకాశం కల్పించడం గమనార్హం.

దాదాపు 38 ఏళ్లుగా సంజ‌య్ చాయ్ దుకాణం న‌డుపుతున్నార‌ని.. ఆయ‌న బీజేపీ నేత అని.. ఆ పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయ‌న‌ను గెలిపించుకుని తీరుతామ‌ని భ‌రోసా ఇస్తున్నారు. ఇక‌, చాయ్ వాలా ద‌గ్గ‌ర ప్ర‌చారానికి డ‌బ్బులు లేక పోవ‌డంతో పార్టీ నేత‌లే చందాలు వేసుకుని మ‌రీ గెలిపించేందుకు రెడీ అయ్యారు.

కాగా.. మంత్రి సురేశ్‌ను కాసుంప్టి స్థానం నుంచి బీజేపీ నిలబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంపై సంజయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో 1980 నుంచే భాజపాతో కలిసి పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సంజయ్‌ గతంలో బీజేపీ శిమ్లా మండల్‌ అర్బన్‌కు జనరల్‌ సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత జిల్లాలో పార్టీ మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ శిమ్లా యూనిట్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News