విశాఖ మీద వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాత్మకమైన రాజకీయం పదును తేరుతోంది. నెమ్మదిగా విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న వైసీపీ ఆలోచనలకు అనుగుణంగా ఇపుడు ఒక్కో అడుగూ పడుతోంది. ఇప్పటిదాకా విశాఖ రాజధాని అంటూ మాటలకే పరిమితం అయిన వైసీపీ ఇపుడు చేతలకు దిగుతోంది.
తాము విశాఖ రాజధాని పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నామన్నది గట్టిగా చెప్పబోతోంది. తాజాగా విశాఖ శివారులో ఏకంగా రెండు ఎకరాల సువిశాల స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
విశాఖలో తాము నిర్మిస్తున్న పార్టీ ఆఫీసు అతి తొందరలోనే రాష్ట్ర ఆఫీసుగా మారుతోంది అని అంటున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఇపుడు తాడేపల్లిలో ఉంది. అయితే దాన్ని సాధ్యమైనంత తొందరలోనే షిఫ్ట్ చేయడానికి ఆ పార్టీ ఆలోచిస్తోంది అని వైవీ సుబ్బారెడ్డి మాటలను బట్టి అర్ధం అవుతోంది. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇరవై నాలుగు గంటలూ పనిచేసే విధంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దనున్నట్లుగా సుబ్బారెడ్డి తెలిపారు.
మొదటి దశ నిర్మాణం పనులు రెండు నెలల్లో పూర్తి అవుతాయని అంటున్నారు. ఒక షేప్ రూపూ వచ్చిన తరువాత ఉగాది నాటికి విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని షిఫ్ట్ చేస్తారు అని అంటున్నారు. అంటే విశాఖ రాజధానికి ఇది తొలి మెట్టు అని అంటున్నారు. నిజానికి ఇప్పటిదాకా ఏపీలోని అన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయాలు విజయవాడలోనే ఉన్నాయి. కొత్తగా జాతీయ పార్టీ అయిన బీయారెస్ కూడా తన ఏపీ ఆఫీస్ ని విజయవాడలోనే ఏర్పాటు చేయడానికి చూస్తోంది.
ఈ నేపధ్యంలో ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా భావించి సమీపంలోనే తమ పార్టీ ఆఫీసులు పెట్టుకున్నాయి. ఇపుడు సడెన్ గా వైసీపీ తన రాజధాని మాత్రం విశాఖ అని చెప్పబోతోంది. విశాఖ మీద మొదటి నుంచి మోజు పెంచుకుంటున్న జగన్ పాలన అక్కడి నుంచే చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే న్యాయపరమైన అభ్యంతరాలు ఉండడంతో ఆ పని చేయలేకపోతున్నారు.
అయితే విశాఖ రాజధాని అని అటు రాజకీయ జనాలకు ఇటు రాష్ట్ర జనాలకు బలమైన సంకేతం ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే తమ చేతిలో ఉన్న పని అయిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విశాఖకు మారుస్తోంది అని అంటున్నారు. విశాఖలో పార్టీ ఆఫీస్ వస్తే మొత్తం అధికార పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇక్కడకు వస్తూ సందడి చేస్తారు. అధికారంలో ఉన్న పార్టీ ఆఫీస్ విశాఖలో పెడితే మరి మిగిలిన పార్టీలు కూడా విశాఖ నుంచే కౌంటర్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అవి కూడా ఇక్కడకి తరలివస్తాయా అన్నది చూడాలి.
ఇదిలా ఉంటే కొత్త ఏడాది విద్యా సంవత్సరం నాటికి ముఖ్యమంత్రి ఆఫీస్ కూడా విశాఖకు తరలివస్తుంది అని మంత్రి గుడివాడ అమరనాధ్ ఈ మధ్యనే చెప్పుకొచ్చారు. అంటే ఇప్పటికి సరిగా ఆరు నెలల సమయం ఉంది. ఆనాటికి సుప్రీం కోర్టు లో ఉన్న అమరావతి రాజధాని కేసు మీద తీర్పు వస్తుంది అని భావిస్తున్నారు. మరో వైపు చూస్తే మూడు రాజధానుల మీద ప్రభుత్వం కొత్త చట్టం చేస్తుంది అని అంటున్నారు. మరి అది ఎపుడు చేస్తారు అన్నది తెలియడంలేదు. ఏది ఏమైనా విశాఖ మన రాజధాని వైసీపీ వారు అంతా ఫిక్స్ అయిపోయారు. అలా వైసీపీ విశాఖ వైపుగా అడుగులు వేస్తోంది. రాజకీయంగా వైసీపీ తీసుకున్న పార్టీ ఆఫీస్ షిఫ్టింగ్ ఏపీలో ఏ రకమైన పొలిటికల్ చర్చకు తావిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.