ఏపీలో ఉప ఎన్నిక‌ల‌కు ఛాన్స్‌.. ఎలానంటే..?

Update: 2018-06-07 09:12 GMT
చేసేది లేదు. కానీ.. చేసినోళ్ల‌ను వేలెత్తి చూపించే తీరు ఏపీ అధికార‌ప‌క్షానికి ఎక్కువే. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పాతిక మంది ఎంపీల్ని త‌న‌కు ఇస్తే.. తాను ప్ర‌త్యేక హోదాను తీసుకొస్తాన‌ని చెబుతున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. మ‌రి.. అలాంటి వ్య‌క్తి ఏడాది క్రిత‌మే.. హోదా విష‌యంలో హ్యాండిచ్చిన మోడీ మాస్టారి తీరుకు నిర‌స‌న‌గా త‌న ఎంపీల చేత రాజీనామా చేయిస్తే.. అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేవి. ప్ర‌జాగ్ర‌హం ఎలా ఉంద‌న్న విష‌యం మోడీ మాస్టారికి అర్థ‌మ‌య్యేలా చేసే వీలుంది. కానీ.. అలా చేయ‌ని బాబు.. జ‌గ‌న్ పార్టీపై మాత్రం విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్‌ ను మొద‌ట్నించి ఒకేతీరులో డిమాండ్ చేస్తున్న ఏపీ విప‌క్ష నేత‌.. తాను చెప్పిన‌ట్లే త‌న ఎంపీల చేత రాజీనామా చేయించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. రాజీనామాలు చేయ‌టాన్ని డ్రామాగా అభివ‌ర్ణిస్తున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు  రాజీనామాలు చేయ‌టం వ‌ల్ల ఉప ఎన్నిక‌లు రావంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే.. ఏడాది కంటే ముందుగానే జ‌గ‌న్ పార్టీ ఎంపీలు త‌మ రాజీనామాల్ని స్పీక‌ర్ కు అంద‌జేసినా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

రాజీనామాల్ని ఎలాంటి త‌ప్పులు లేకుండా.. చెల్లుబాటు అయ్యేలా చేయ‌టం వ‌ర‌కే ఎంపీల బాధ్య‌త‌. వాటిని ఆమోదించే బాధ్య‌త లోక్ స‌భ స్పీక‌ర్ చేతిలో ఉంటుంద‌ని మ‌ర్చిపోకూడ‌దు. ఒక‌వేళ జ‌గ‌న్ పార్టీ ఎంపీలు ఉప ఎన్నిక‌లు రావ‌న్న ఉద్దేశంతోనే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన‌ట్లుగా ఆరోపిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌లువురు ఒక ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. ఉప ఎన్నిక రాద‌న్న‌దే నిజ‌మైతే.. త‌న ఎంపీల చేత బాబు ఎందుకు రాజీనామా చేయించ‌లేద‌ని నిల‌దీస్తున్నారు.

ఎందుకిలా ఉంటే.. దీనికి కార‌ణం లేక‌పోలేదు. జ‌గ‌న్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల‌తో ఉప ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికి అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అదెలానంటే.. ఒక ఎంపీ చేసిన రాజీనామాను ఏ డేట్ నాటి నుంచి ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లుగా ఆమోదించార‌న్న అంశం మీద ఉప ఎన్నిక ఉంటుందా?  ఉండ‌దా?  అన్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంది.

తాజాగా ఉదంతంలోనే చూస్తే..జ‌గ‌న్ పార్టీ ఎంపీలు ఏప్రిల్ ఆరో తేదీన త‌మ రాజీనామా ప‌త్రాల్ని స్పీక‌ర్ కు అందించి వ‌చ్చారు. ఆ లెక్క‌న చూస్తే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది కంటే ముందే వారు త‌మ రాజీనామా లేఖ‌ల్ని ఇచ్చిన‌ట్లు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏడాది కంటే ముందు రాజీనామా లేఖ‌ల్ని ఆమోదిస్తే.. ఉప ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంది. జ‌గ‌న్ పార్టీ ఎంపీలు ఇచ్చిన రాజీనామాల్ని.. వారు ఇచ్చిన తేదీని ప్రాతిప‌దిక‌గా తీసుకొని.. వాటిని ఆమోదిస్తే ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌క వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ భ‌యంతోనే చంద్ర‌బాబు త‌న ఎంపీల చేత రాజీనామా చేయించ‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సో.. లోక్ స‌భ స్పీక‌ర్ నిర్ణ‌యం మీద‌నే ఏపీలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయా?  లేదా? అన్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News