భార్యాభర్తలు కలిసున్నపుడు వారి మధ్య గిల్లికజ్జాలు సరదాగా ఉంటాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అనూహ్యమైన షాక్ లివ్వడం....థ్రిల్ చేయడం వంటి ఘటనలు కపుల్స్ మధ్య కామన్. అయితే, అదే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినపుడు ఫన్ కు బదులుగా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అందులోనూ....తన బంధానికి గుడ్ బై చెప్పి విడాకులు తీసుకునే గ్యాప్ లో ఏ మాత్రం చాన్స్ దొరికినా....ఒకరిపై ఒకరు స్వీట్ రివేంజ్ తీర్చుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. తమ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం....ఇంజన్ ఆప్ చేసిన కారును భార్య చేత కిలోమీటరు తోయిస్తాడో భర్త. అదేమిటని భార్య అడిగితే కారు నడపమన్నాను గానీ....ఇంజన్ ఆన్ చేస్తానని చెప్పానా అని అంటాడు. బ్రహ్మానందం - కోవై సరళల మధ్య జరిగిన ఆ టాలీవుడ్ సినిమా సీన్ తరహాలోనే తాజాగా జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వృత్తి రీత్యా లాయర్ అయిన ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చారు. తన భార్యకు ప్రతినెలా రూ.25,000 భరణంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అసలే లాయర్ కావడంతో కోర్టు ఆదేశాలు తూ.చ తప్పకుండా పాటిస్తూ భార్యకు రూ.25,000 చెల్లించాడు. ఇందులో పెద్ద విశేషమేముంది....అనుకోకండి. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. తన భార్యపై స్వీట్ రివేంజ్ ప్లాన్ చేసిన ప్లీడరుగారు...ఆ మొత్తాన్ని నోట్ల రూపంలో కాకుండా.. చిల్లరగా ఇచ్చి భార్యకు షాకిచ్చారు. మొత్తం రూ.24,600లను రూ.1 - రూ.2 కాయిన్స్ రూపంలో ఇచ్చి...మిగిలిన నాలుగు వందలను వందనోట్లుగా ఇచ్చారు. తన భర్త షాక్ నుంచి కోలుకున్న ఆ భార్య....కోర్టును ఆశ్రయించింది. తనను టార్చర్ పెట్టేందుకు కావాలనే ఇలా `చిల్లర`వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. చివరకు ఆ వ్యవహారం కోర్టుకు చేరడంతో....లాయర్ గారు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భరణాన్ని చిల్లర రూపంలో ఇవ్వొద్దని రాజ్యాంగంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని ...తన భార్యకు లాజిక్ తో సమాధానమిచ్చారు. భార్యాభర్తల చిల్లర వ్యవహారం....సోషల్ మీడియాలో వైరల్ అయింది.