ఆర్ యూ రెడీ....బాబు డైరెక్ట్ అటాక్

Update: 2022-09-23 23:30 GMT
ఏపీలో ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ పట్టుదల పట్టింది. అందుకోసం కాళ్ళకు బలపాలు కట్టుకుని అధినేత చంద్రబాబు ఏపీ అంతా కలియతిరుగుతున్నారు. అదే టైం లో పార్టీ నియోజకవర్గ ఇంచార్జులతో వరసబెట్టి మరీ  సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇవన్నీ హాట్ హాట్ గా సాగడం టీడీపీ వారికి  సరికొత్త అనుభవం.

చంద్రబాబు ఎపుడూ తాను చెప్పాల్సింది గంటల తరబడి చెబుతూ ఉంటారు. ఆ మీదట నాయకులు చెప్పింది విని కారీ ఆన్ తమ్ముళ్ళూ  అనేసి ముగిస్తారు. కానీ ఈ మధ్య బాబు వైఖరిలో బాగా మార్పు వచ్చేసింది అని తమ్ముళ్ళే అంటున్నారు. ఆయన వరసబెట్టి చేస్తున్న రివ్యూలలో తమ్ముళ్లకు కొన్ని చోట్ల బాగా క్లాస్ తీసుకుంటున్నారు.

అన్ని రకాలైన నివేదికలు నా దగ్గర ఉన్నాయి. మీ జాతకాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. మీరు ఎన్నికలకు సిద్ధమేనా  ఆర్ యూ రెడీ అంటూ డైరెక్ట్ అటాక్ చేస్తూ తమ్ముళ్ళను అడిగేస్తున్నారు చంద్రబాబు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా చేయకుండా మిన్నకున్నారు కొందరు. మీ సహకారం లేకపోతే ఎలా. నాకు గెలుపు గుర్రాలు మాత్రమే కావాలి. ఎలాంటి మొహమాటాలకు తావు లేనే లేదు అని బాబు ఖండితంగా చెబుతున్నారు.

మీరు స్వీట్ వార్నింగ్ అనుకోకండి, పక్కా సీరియస్ వార్నింగ్స్ ఇవి. ఈసారి అధికారంలోకి టీడీపీ తప్పకుండా వస్తుంది. ఏపీలో ఇప్పటిదాకా వచ్చిన ఏ ప్రభుత్వం మీదా కూడా లేని వ్యతిరేకత వైసీపీ మీద ఉంది. అయినా సరే గుమ్మం దాటనంటే  ఎలా తమ్ముళ్ళూ అంటూ బాబు గట్టిగానే  మాట్లాడుతున్నారు.

ఇదే రకమైన దూకుడుతో బాబు గత కొన్ని రోజులుగా సమీక్షలు చేస్తున్నారు. ఆయన ఇప్పటిదాకా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 59 మంది ఇంఛార్జులతో ఆయన ముఖా ముఖి సమావేశం నిర్వహించారు.అదే టైం లో ఆయన  క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని కూడా తన దగ్గర ఉన్న నివేదికలను దగర పెట్టుకుని మరీ  సమీక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా బాబు ఇక నేను ఉపేక్షించను మీరంతా అలెర్ట్ కావాల్సిందే అని చాలా మంది నాయకులకు ముఖం మీదనే చెబుతున్నారు. పనిచేసిన చోట్ల ఆయన తమ్ముళ్లూ కీప్ ఇట్ అప్ అంటూ ప్రోత్సహిస్తున్నారు కూడా.  ఇక తాజాగా చంద్రబాబు రాజమండ్రీకి పార్లమెంట్ పరిధిలోని  రాజమండ్రి సిటీ, పెద్దాపురంతో పాటు విజాయంగరం జిల్లా  రాజాం నియోజవర్గాల ఇంచార్జ్ లు ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, కోండ్రు మురళిలతో సమీక్ష చేశారు.

తరువాత రోజుల్లో మరిన్ని నియోజకవర్గాల ఇంచార్జిలతో బాబు భేటీ కానుక్న్నారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగాలు కూడా బాగా తగ్గించేశారు. మీరు పనిచేయకపోతే చెప్పేయండి అంటూ నేరుగా నాయకులతో నే చెప్పేయడంతో తమ్ముళ్ళు కొత్త బాబుని చూస్తూ హడలిపోతున్నారు. మరి ఈ తరహా సమీక్షలతో అయినా టీడీపీలో వేడి పుడుతుందా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News