ప్రధాని కి చంద్రబాబు లేఖ .. రీజన్ ఇదే

Update: 2021-10-19 10:30 GMT
ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని.. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయని.. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. బీసీ జనగణనపై టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. ఇప్పుడు కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివి అన్నారు. చంద్రబాబు తన లేఖలో పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. బీసీ జన గణన పక్కాగా జరిగి తేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన లేఖలో వివరించే ప్రయత్నం చేశారు. కాగా, తమ ప్రభుత్వ హయాంలోనే బీసీ జన గణన చేపట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. కులాల వారీగా అందు బాటు లో ఉన్న జనగణన వివరాలు 90 ఏళ్ల క్రితానివి.. అది ఇప్పుడు పనికి రాదని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని చంద్రబాబు కోరారు. తమ విజ్ఞప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని కోరారు చంద్రబాబు.
Tags:    

Similar News