విశాఖపట్నానికి రాజధానిని తరలించాలే అనుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి మళ్లీ గెలిచి ఆ పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అలా రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లిన తరువాత వైసీపీ గెలిచి టీడీపీ కనుక ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి రాజధానిపై రెఫరెండానికి వెళ్లాలని సూచించారు. రాజధాని విషయంలో జగన్ అనాలోచిత నిర్ణయాల పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వైసీపీని ఎందుకు గెలిపించామా అని జనం ఇప్పుడు బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు.
సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి రాజధాని అమరావతికే టీడీపీ కట్టుబడి ఉన్నదని తమ స్టాండ్ ప్రకటించిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం లో భాగంగా సోమవారం అనంతపురం లో పర్యటించారు. అనంతపురం జిల్లా పెనుగొండ లో పర్యటించిన చంద్రబాబు వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మోసాలు చేయడంలో సీఎం జగన్‌ను మించినవారు లేరంటూ ఆయన మండి పడ్డారు.
అనంతపురానికి కియా మోటార్స్ తెచ్చి అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు చంద్రబాబు . కర్నూలు కు హైకోర్టు బెంచ్ ఇస్తామని గతంలోనే చెప్పానని.. అప్పుడు వైసీపీ నేతలు హైకోర్టును ముక్కలు చేస్తున్నానంటూ తనపై విమర్శలు చేశారని అన్నారు. పొరుగు రాష్ట్ర మంత్రి, ప్రతిపక్ష నేతలు కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారని , ఏపీలో మూడు రాజధానులు అయితే అది తెలంగాణాకు లాభం అని చెప్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని లేదంటే రాజధాని రెఫరెండం గా ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. జీఎన్ రావు కమిటీ , బోస్టన్ కమిటీ ల నివేదికలను బోగి మంటల్లో వెయ్యాలని చంద్రబాబు అన్నారు. 2లక్షల కోట్ల విలువైన అమరావతిని అప్పగిస్తే సీఎం జగన్‌కు చేతకాక నాశనం చేస్తున్నాడని మండి పడ్డారు. రాయలసీమ నుండి విశాఖ పట్నం వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుందని , తిరిగి రావటానికి రెండు రోజులు పడుతుందన్న చంద్రబాబు వైజాగ్ రాజధాని అయితే రాయలసీమ వాసులకు తీవ్ర ఇబ్బంది అని చెప్పారు. రాజధాని అమరావతి కోసం అందరూ కలిసి పోరాటం సాగించాలని విజ్ఞప్తి చేశారు.