అనంతపురం జిల్లా గురించి చెప్పటం మొదలుపెడితే బాధల గురించి.. అక్కడి కష్టాల గురించి అనంతంగా చెప్పాల్సి వస్తుంది. వైశాల్యంలో ఒక చిన్నపాటి దేశాన్ని తలపించే పరిస్థితి ఉన్నా.. అందులో వర్షం పడే ప్రాంతాలే కనిపించవు. సాగుకు సూపర్ అయిన ఎర్రటి నేలకు కొదవలేకున్నా.. నీళ్ల లభ్యతే కనిపించదు. దక్షిణ భారతదేశానికి గేట్‌వే అని గొప్పలు చెప్పుకోవటానికి పనికి వస్తుందే తప్ప.. అక్కడి కరవును తీర్చేందుకు మాత్రం సాయం చేయదు.
మానవ వనరులు మొదలు దేనికిలోటు లేని అనంతపురం జిల్లాలో తాగునీరు.. మంచినీళ్లకు మాత్రం కటకటే. దీనికితోడు పాలకుల నిర్లక్ష్యం ఉండనే ఉంది. మరి.. అలాంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో ఉన్న పాజిటివ్ కోణాలు ఎవరికి పట్టకుండా పోయే పరిస్థితి. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అనంతపు ఒక అనామకపు జిల్లాగానే చూశారే తప్పించి.. ఆ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలన్న విషయాన్ని ఎవరూ పెద్దగా ఆలోచించలేదు.
రాష్ట్ర విభజన పుణ్యమా అని అనంతపురం అభివృద్ధి గురించి చర్చ మొదలైంది. ఒక కదిలిక పుట్టింది. ఆ జిల్లాకు ఉన్న బలాలు.. బలహీనతలపై ఒక అంచనా మొదలైంది. ఇది ఒకందుకుమంచిదే అయినా.. ఈ కదలిక నామమాత్రం కాకుండా చిత్తశుద్ధితో జరిగితేనే మేలు.
అనంతపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పటమే కాదు.. చేతల్లో చేసి చూపించే దిశగా తొలి అడుగు పడింది. ఈ జిల్లాలో సెంట్రల్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ అకాడమీ శంకుస్థాపనకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో పాటు.. మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు అధికారపక్ష నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. తాను అనంతపురం జిల్లాకు రావటానికి రెండు కారణాలుగా చెప్పారు. ఒకటి.. శంకుస్థాపన కార్యక్రమం అయితే.. రెండోది మాత్రం అనంతపుం జిల్లాను అంచనా వేసేందుకు వచ్చానని చెప్పారు. ఆయన మాటల్ని నిశితంగా పరిశీలించినప్పుడు శంకుస్థాపన పెద్ద విషయం కాదు కానీ.. అనంతపురంపై అవగాహన చాలా అవసరమన్న ఆలోచన ఆయన మాటల్లో కనిపించింది.
బెంగళూరు మహానగరానికి చాలా దగ్గరగా ఉండే అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాటిచ్చారు. తాజాగా అరుణ్‌జైట్లీ మాటలు రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చాయి. ఒకటి ప్రత్యేకహోదా విషయాన్ని కనీసం ప్రస్తావించని నేపథ్యంలో.. దానిపైఆశలు పెట్టుకోవాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లు అయ్యింది. ఇక.. అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసే పూచీకత్తు తాము తీసుకున్నామన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఇందుకు సంబంధించి బెంగళూరుకు దగ్గర్లో ఉన్న సానుకూలాంశాన్ని ప్రస్తావించటం ద్వారా అనంత సుడి తిరిగే అవకాశం ఉందన్న ఆశలు కల్పించటంలో మాత్రం జైట్లీ సక్సెస్ అయ్యారు. మరి.. అనంత ఏ రేంజ్‌లో అభివృద్ధి చెందుతుందో చూడాలి.