అధికారం చేతిలో లేకపోతే ఎలా ఉంటుందో చంద్రబాబుకు మరోసారి అర్థం అయ్యేలా చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అధికారం చేతిలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన వివిధ పనుల గురించి ఏకరువు పెట్టడంతో పాటు, ఇటీవలి పరిణామాలను కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆ మాటలు వింటూ ఒక్కోసారి చంద్రబాబు నాయుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతూ ఉండటం గమనార్హం.
మాటల పోటీలో కొందరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ముందుంటారు. అలాంటి వారిలో ఒకరు అంబటి రాంబాబు. అసెంబ్లీలో తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబు మీద ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు అంబటి. అందులో భాగంగా అమరావతిపై చర్చ సందర్భంగా అంబటి మాట్లాడిన మాటలతో చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందే పడ్డారు.
అదే సమయంలో కెమెరా చంద్రబాబు మీదకు మళ్లింది. దీంతో అంబటి పంచ్ లకు చంద్రబాబు ఎక్స్ ప్రెషన్లు ఎంత బేలగా ఉన్నాయో అసెంబ్లీ ప్రసారాన్ని వీక్షించిన వారికి అర్థం అయిపోయింది. అమరావతికి నిధుల కేటాయింపు జరగలేదంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి అంశం గురించి అంబటి స్పందించారు. అమరావతికి చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో అంటూ.. తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు.
మొదట్లో ఆ మాటలపై నవ్వుతూ స్పందించిన చంద్రబాబు నాయుడుకు ఆ తర్వాత మొహంలో రంగులు మారిపోయాయి. ఓటుకు నోటు కేసులో దొరికి పోయి హైదరాబాద్ ను ఖాళీ చేశారంటూ.. తనను అసెంబ్లీలో విమర్శిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితే అయ్యింది చంద్రబాబుది. ఇక అమరావతిలో చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంలో ఉంటారనే అంశాన్ని అప్పుడే ప్రస్తావించారు అంబటి.
'పల్లెల్లో ఎవరిదైనా ఇల్లు కాలిపోతే పక్కింటి వాళ్లో ఎదురింటి వాళ్లో వచ్చి తమ ఇంట్లో ఉండమని అంటారని, అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కొంతమంది చేరి ఆయనను పిలిచారని.. పిలిచి పూజలు చేస్తామంటూ వారు రమ్మన్నారని..' అంటూ అంబటి విరుచుకుపడ్డారు. అలా తెలుగుదేశం ప్రచారానికి అంబటి ఘాటైన కౌంటర్లు ఇచ్చారు. అలా అంబటి మాట్లాడుతుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గొంతులో తడారిపోయినట్టుగా కూర్చుండిపోయారు!