అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి ఆయనే మళ్లీ అధికారంలోకి రావాలని అని కామెంట్లు చేసినా.. చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయన భజన చేసి, జగన్ ను తిట్టినా.. మర్రి శశిధర్ రెడ్డికి అందుకు తగ్గ ప్రయోజనాలు కనిపించడం లేదట. ఉన్నట్టుండి శశిధర్ రెడ్డి అమరావతి వెళ్లి చంద్రబాబు భజన ప్రోగ్రామ్ పెట్టుకోవడంన వెనుక చాలా కథే ఉందని సమాచారం.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో శశిధర్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడట. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ అయినా దక్కుతుంది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శశిధర్ రెడ్డి చంద్రబాబు ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ కు చెప్పిద్దామని అనుకున్నారట.
అందుకే బాబును వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. లెక్క ప్రకారం తెలంగాణలో టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిద్దరూ ఇంకా తెరాసలోకి చేరలేదు.ఈ నేఫథ్యంలో వారి మద్దతు ఇవ్వాలని..కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర తన పేరును సిఫార్సు చేయాలని శశిధర్ రెడ్డి చంద్రబాబుకు విన్నవించుకున్నాడట.
అందుకే..చంద్రబాబు భజన చేశాడట.చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని..జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కాకూడదని శశిధర్ రెడ్డి అన్నాడట. అయితే ఇంతలా భజన చేసినా.. చంద్రబాబు నాయుడు మాత్రం శశిధర్ రెడ్డికి అభయం ఇవ్వలేదట.ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో లాబీయింగ్ కు చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపడం లేదట.ఎలాగూ ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన ఇద్దరూ కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తారనే నమ్మకాలు ఏమీ లేవు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలదూర్చే ధైర్యం లేదని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయంలోకి వేలు పెట్టి చంద్రబాబు నాయుడు చాలా దెబ్బతిన్నాడు. ఇలాంటి నేపథ్యంలో…శశిధర్ రెడ్డి భజన చేసినా తెలంగాణ రాజకీయంలోకి వేలు పెట్టే ధైర్యం చేయడం లేదట చంద్రబాబు.