తెలుగుదేశం పార్టీ ఎపుడూ ఘనమైన చరిత్ర తమకు ఉందని చెబుతూ తెగ మురిసిపోతూ ఉంటుంది. చరిత్ర ఎపుడూ బాగానే ఉంటుంది. అదే టైమ్ లో అది వయసుని కూడా బయటపెడుతుంది. ఇపుడు టీడీపీ అలాంటి విచిత్రమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు చెప్పుకుంటారు. అలా ఆయన వయసు ఏడు పదులు దాటింది అన్న సత్యం చెప్పకనే బయటపడుతుంది. టీదీపీకి ఈ వయసే ఇపుడు మైనస్ అయ్యేలా ఉందిట. ఇక టీడీపీకి చంద్రబాబు సారధ్యం తప్ప మరో నాయకత్వం కూడా లేకపోవడమే ఆ పార్టీని ఇరకాటంలో పెడుతోంది. లోకేష్ అయితే తన వారసుడిగా లోకేష్ కి ఓటు వేస్తున్నారు. ఎంతైనా పుత్ర రత్నం కదా. ఆ ప్రేమ బాబులో పొంగిపొరలుతోంది. తన వారసుడిగా భావి ముఖ్యమంత్రిగా లోకేష్ ని బాబు సదా తలుస్తున్నారు.
కానీ టీడీపీ మొత్తంలో అదే అభిప్రాయం ఉందా అంటే సమాధానం మాత్రం నిరాశే అంటున్నారు. ఎందుకంటే లోకేష్ ఈ రోజుకీ తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. ఆయన ఇంకా తనను తాను ఎక్కడా రుజువు చేసుకోలేదు. కనీసం మంగళగిరిలో గెలిచి వస్తే బాబు తరువాత అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉండి విపక్షంలో కొంత జోరు అయినా చూపించేవారు. కానీ అక్కడ ఓడడంతో సీన్ కాలింది. గత రెండున్నరేళ్లలో లోకేష్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా క్షేత్రంలో చేసిన అరవీర భయంకర పోరాటాలు ఏవీలేవు. దాంతోనే సీనియర్ నేతలు లోకేష్ సారధ్యం అంటే జంకుతున్నారు అన్న మాట ఉంది. ఇది పార్టీలో సీన్ అయితే జనాల్లో తీసుకుంటే చంద్రబాబు దీక్షాదక్షతల మీద ఎంతో కొంత సానుకూలత ఉంది.
బాబు రాజకీయ మాయోపాయాలు ఎలా ఉన్నా ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అన్న మాటను చాలా మంది అంగీకరిస్తారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఓటు వేయాలంటే ఆయన ఏజ్ అనే ఫ్యాక్టర్ అడ్డు వస్తోంది అంటున్నారు. ఆ ఎన్నికల నాటికి బాబుకు డెబ్బై అయిదేళ్ళు వస్తాయి. మరి అంత లేట్ వయసులో బాబు సీఎం గా పూర్తి ఉత్సాహంతో పనిచేయగలరా అన్నదే చర్చగా ఉంది మరి. అయితే బాబుకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. పైగా చాలా మంది జాతీయ నేతల కంటే ఆయన చురుకుగా ఉంటారు. అందువల్ల బాబును సీఎం చేసుకోవాలి అనుకుంటే ఓటు వేయడం ఖాయం.
కానీ అయిదేళ్ళ పాటు పాలించాలి. అంటే 2029 ఎన్నికలు వచ్చే నాటికి బాబుకు ఎనభై ఏళ్ళు వస్తాయి. మరి బాబు సీనియర్ మోస్ట్ సిటిజన్ గా ఏపీ లాంటి సకల నష్టాల కష్టాల పాలు అయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలరా అన్న డౌట్ అయితే చాలా మందిలో రావడం సహజం. అయినా సరే బాబుని నమ్మి ఓటేసినా ఆయన మధ్యలో మిడిల్ డ్రాప్ అంటూ ఒకటో రెండో ఏళ్ళు పాలించి రాష్ట్రాన్ని కొడుకు లోకేష్ కి అప్పగిస్తే అపుడు సంగతేంటి అన్న భయాలు ఇటు పార్టీ వర్గాలతో పాటు సగటు జనాల్లోనూ ఉన్నాయట. సరిగ్గా ఈ భయాలే వైసీపీకి రేపటి ఎన్నికల్లో రాజకీయ పెట్టుబడి అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఫిఫ్టీ ప్లస్ లో ఉంటారు. పైగా అయిదేళ్ళ పాటు సీఎం గా పాలించిన అనుభవం ఉంటుంది. అదే టైమ్ లో సమర్ధ నేతగా కూడా ఉన్నారు. ఇప్పటిదాకా ఆయనే ఏపీని నడిపారు కాబట్టి మరో చాన్స్ ఆయనే ఇస్తే పోలా అన్న ఆలోచన తటస్థ జనాల్లో కలిగితే మాత్రం అది పూర్తిగా టీడీపీకి దెబ్బే. ఒక విధంగా చంద్రబాబు ఏజ్ ఫ్యాక్టర్, టీడీపీలో నాయకత్వ లేమిని ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవాలని పక్కాగా ప్లాన్ వేస్తోంది అంటున్నారు. అలాంటి పోటీ, పోలికా కనుక పెడితే మాత్రం జగన్ కి సూపర్ అడ్వాంటేజ్ అవుతుందే అంచనాలు ఉన్నాయి.