తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్న మంత్రి కేటీఆర్ తాజాగా కీలక అంశంపై స్పందించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ప్రచారం చేస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ తమపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాల గురించి స్పందిస్తూ ``రాహుల్ గాంధీ - చంద్రబాబు కుటుంబాల సభ్యులు రాజకీయాల్లో లేరా? మాది ఒక్కటే ఫ్యామిలీ రాజకీయాల్లో ఉందా?`` అని కేటీఆర్ తామేం చేస్తున్నామో పరోక్షంగా చెప్పేశారు. తద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వారసత్వ రాజకీయాలు సహజమనే అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించారు.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్ కాలేరు అని ఉత్తమ్ ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి పండుగకి గంగిరెద్దుల లాగా రాజకీయ నాయకులు ఊర్లలోకి వస్తున్నారని కేటీఆర్ ఎద్దెవా చేశారు. కేసీఆర్ ను ఓడగొట్టడానికి అందరూ ఒకటి అయ్యారు.. సింహం సింగిల్ గా వస్తుంది.. కానీ గుంపులు గుంపులుగా పందులు వస్తున్నాయని జాగ్రత్త అని ప్రజలకు కేటీఆర్ సూచించారు. `కేసీఆర్ ను ఒంటరిగా ఢీ కొనలేక కూటమిగా వచ్చారు. రాహుల్ గాంధీకి టీడీపీని చంద్రబాబు తోకపార్టీని చేసిండు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు మళ్లీ మన ముందుకు జంటగా వస్తున్నారు. కేసీఆర్ పేదలపక్ష పాతి. మంచి చేసే ముఖ్యమంత్రిని కాపాడుకుందాం. ఆలోచించి ఓటేయండి... ఆగంకాకండి`` అని ప్రజలను కేటీఆర్ కోరారు.
రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లిన తనకు మంచి గుర్తింపు వస్తుందంటే దానికి సిరిసిల్లనే కారణమని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మాటే వినిపిస్తోందని అన్నారు. సిరిసిల్లకు రాబోయే రెండేళ్లలో రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. మానేరుపై రాజమండ్రి తరహాలో రైలు కం రోడ్ వంతెన ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం.. ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.