సమయానికి తగ్గట్లు వ్యక్తుల్ని వాడేయటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. మొన్నటివరకూ కాంగ్రెస్ అధినేత రాహుల్ తో పూసుకు రాసుకు తిరగటమే కాదు.. దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి మరీ.. ఒకే వేదికను పంచుకున్న వైనం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి హాజరైన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ను ఆకాశానికి ఎత్తేసినట్లు మాట్లాడిన చంద్రబాబు గొంతు ఇప్పుడు మారిపోయింది. తాజాగా కోల్ కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష చేయటం.. మోడీ.. సీబీఐల తీరును తప్పు పట్టటం లాంటి పరిణామాలతో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి.
ఇదిలా ఉంటే మమత చేస్తున్న నిరసనకు కొందరు ముఖ్యమంత్రులు.. పలు పార్టీల అధినేతలు స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏకంగా కోల్ కతాకు వెళ్లారు. మమతకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ఇక్కడితో ఆపితే ఆయన్ను చంద్రబాబు ఎందుకంటారు? రానున్న ఎన్నికల్లో మమత పార్టీ తృణమూల్ కు 42 ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్ చేస్తారన్న జోస్యాన్ని చెప్పారు.
మొన్నటి వరకూ మోడీ నేతృత్వంలో నడిచే బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు. మోడీ వ్యతిరేక విపక్ష కూటమికి నిర్మాత మమత అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు మమత మూలస్తంభమని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మమత తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తారని వ్యాఖ్యానించారు. మమతను మస్తుగా పొగిడేసిన చంద్రబాబు.. మోడీని వ్యతిరేకించిన వారిపై వేధింపులు మామూలేనని.. తమ ఎంపీల మీద సీబీఐ.. ఈడీలను ప్రయోగించారన్నారు. జనవరి 19న కోల్ కతాలో నిర్వహించిన విపక్షాల ర్యాలీలో పాల్గొన్న 23 పార్టీల ప్రతినిధిగా తాను హాజరయ్యానని వెల్లడించారు. విపక్ష కూటమికి మమత మూలస్తంభమన్న చంద్రబాబు.. మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ సంగతేంది? అన్నది ప్రశ్న. మమత సీన్లోకి వచ్చాక రాహుల్ ను పులుసులో మునక్కాయ చందంగా మార్చేశారా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.