తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు సబ్యులని ప్రకటించిన సంగతి తెలిసిందే. శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో బోర్డు ఏర్పాటు చేశారు. టీటీడీ పాలకమండలిలో మార్పులు చేయడంపై సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖరాశారు. పవిత్రక్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా పేరు ప్రఖ్యాతి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు జరగలేదన్నారు. స్వప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారని ఆరోపణలు చేశారు.
రెండేళ్లలో తిరుమల కొండపై అనేక అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని, వెంటనే సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, బోర్డు రద్దు చెయ్యాలని చంద్రబాబు ఆ లేఖలో సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా పేరు ప్రఖ్యాతి కలిగిన టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదన్నారు. భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులకు చోటు కల్పించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. స్వామివారిపై భక్తి భావంతో, స్వామివారి సేవలో తరించే వారికి బోర్డులో ప్రాధాన్యమివ్వకుండా.. కొంతమంది వ్యక్తుల సేవలో మునిగి తేలే వారికే అవకాశం ఇచ్చారన్నది సుస్పష్టమన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో జంబో బోర్డు ఏర్పాటు చేశారన్నారు. అనర్హులను సభ్యులుగా నియమించి శ్రీవారి ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను కించపరిచారన్నారు. సామాన్య భక్తుల దర్శనాలకు రకరకాల నిబంధనలు విధించి, వీఐపీల సేవలో తరించే విధానాన్ని ప్రస్తుతం చూస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సాంప్రదాయాలను గాలికొదిలేసి తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని, ధర్మకర్తల మండలిలో సభ్యత్వమంటే భక్తి భావానికి ప్రతీకగా ఉండేదన్నారు.
గతంలో సభ్యత్వం కల్పించాలనుకుంటే వారి వ్యక్తిగత గుణ గణాలను పరిశీలించి బోర్డులో సభ్యత్వం కల్పించేవారన్నారు. కానీ నేడు స్వప్రయోజనాల కోసం, రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారన్నారు. సేవాభావమే జీవిత లక్ష్యంగా ఉండే వారిని గతంలో ధర్మకర్తల మండలిలో నియమించడం జరిగిందన్నారు. కానీ నేడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను కూడా సభ్యులుగా నియమించి బోర్డు పవిత్రతను దెబ్బతీశారన్నారు. గత రెండున్నరేళ్లుగా తిరుమల పవిత్రత, ప్రాశస్త్యం దెబ్బతింటున్నదని.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ టీటీడీ ఆస్తుల వేలానికి పూనుకున్నారననారు.
ఎస్వీబీసీ ఛైర్మన్ రాసలీలలు, భక్తుల తలనీలాల స్మగ్లింగ్, టీటీడీ మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించడం, లడ్డూ ప్రసాద ధరలు పెంచడం, భక్తి శ్రద్దలతో స్వీకరించే శ్రీవారి ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేయడం వంటి అనేక అనైతిక చర్యలు చోటు చేసుకున్నాయన్నారు. ధర్మకర్తల మండలి ఏర్పాటులో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలతో పాటు, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు.