ఏ రోజుకు ఆ రోజును ఒక్కోలా బుక్ చేసేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సోమవారం వచ్చిందంటే.. ఆ రోజును పోలవరం కోసం కేటాయించేసిన వైనం తెలిసిందే. శనివారాన్నిస్వచ్ఛ కార్యక్రమాల కోసం కేటాయించిన చంద్రబాబు.. తాజాగా శుక్రవారం స్లాట్ ను బుక్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం ఫిర్యాదుల వారంగా నిర్వహించాలని డిసైడ్ చేశారు. గతంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేగా నిర్వహించేవారు.
ఆ రోజు జిల్లాల్లో ప్రతి కలెక్టరేట్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు. ప్రజలు తమ ఫిర్యాదులు చెప్పాలంటే సోమవారం వచ్చి తమ కంప్లైంట్స్ చెప్పుకునే వీలుంది. తాజాగా సోమవారానికి బదులుగా శుక్రవారానికి మారుస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు అధికారులంతా వెలగపూడిలోని సచివాలయంలోనే ఉండాలని.. వారితోపాటు ప్రజాప్రతినిధులు సైతం ఉండాలని బాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
వివిధ సమస్యలపై ప్రజలు.. ప్రజాప్రతినిధులు సచివాలయానికి వెళితే.. అక్కడ మంత్రులు తమకు అందుబాటులో ఉండటం లేదన్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో..ఇకపై ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డేగా డిసైడ్ చేసిన బాబు.. మంత్రులు.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. తాజాగా విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల్లో గ్రీవెన్స్ డే రోజున అందుబాటులో ఉండే వారి గురించి సమాచారం అందిస్తూ.. అధికారులతో పాటు మంత్రులనూ చేర్చింది. మంత్రులు మొదలు.. అన్నిస్థాయిల అధికారులు ఆఫీసుల్లోనే ఉండాలని తేల్చి చెప్పింది. రానున్న రోజుల్లో మరెన్ని రోజుల్ని ఈ విధంగా బాబు ఫిక్స్ చేస్తారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/