ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం దాదాపు నాలుగు గంటల పైనే సాగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. ఒక అంశంలో మాత్రం మంత్రులకు.. ఏపీ ముఖ్యమంత్రికి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం విశేషం. ఏపీ రాజధాని అమరావతిలో భూముల్ని పలు ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలకు.. ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పార్టీలకు కూడా భూములు కేటాయించాలన్న అంశం చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా పలువురు మంత్రులు స్పందిస్తూ.. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీకి భూమి ఇవ్వాల్సిన అవసరం లేదన్న వాదనను వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి భూమిని కేటాయించాల్సిన అవసరమే లేదంటూ వారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి భూమి కేటాయించాల్సిన అవసరం లేదన్న మాటల్ని సావధానంగా విన్న చంద్రబాబు చివర్లో కల్పించుకొని.. రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా.. ప్రధాన పార్టీలకు ఎంతోకొంత భూమిని కేటాయించటం సమంజసంగా ఉంటుందన్న మాటను చెప్పారని చెబుతున్నారు.
ఈ విషయం తెలిసిన వారంతా.. కాంగ్రెస్ విషయంలో ఏపీ మంత్రులు మరి ఇంత కటువుగా ఉన్నారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు.. తన మంత్రుల మాటల్ని బలపర్చకుండా.. పెద్దమనిషి తరహాలో మాట చెప్పారన్న మాటను కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.