తెలుగురాష్ట్రాల ఇద్దరు చంద్రుళ్ల గురించి తెలియంది ఎవరికి. కానీ.. వీరిద్దరిలో ఉన్న వైరుధ్యాలు తక్కువ మందికే తెలుసు. చాలా అంశాల్లో ఇద్దరి మైండ్ సెట్ ఒకటిగా కనిపించటం.. ఒకేలాంటి నిర్ణయాలు ఇద్దరూ తీసుకోవటం.. ఒకేలాంటి అనుభవాలు ఇద్దరికి కాస్త అటూఇటూగా చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి విషయంలో ఒకేలా అనిపించినా.. రాజకీయ వ్యూహాల్లో మాత్రం ఇద్దరి ఆలోచనలు తూర్పు.. పడమరలుగా ఉంటాయి. ఆ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. గ్రేటర్ ఎన్నికల విషయంలో ఇద్దరు చంద్రుళ్లు అనుసరించిన వైనం చూస్తే.. వీరి ఆలోచనలు ఎంత వైరుద్యంగా ఉంటాయో అర్థమవుతుంది.
దాదాపు ఏడేళ్ల కిందట.. 2009లో గ్రేటర్ కు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పోటీకి అప్పటి ఉద్యమ నాయకుడు.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సుతారం ఇష్టపడలేదు. గ్రేటర్ బరిలోకి దిగేందుకు నో అని చెప్పేశారు. గ్రేటర్ బరిలోకి దిగి విజయం సాధించే అవకాశం లేనప్పుడు అపజయం మూటగట్టుకోవటం ఏ మాత్రం మంచిది కాదన్న ఆలోచనతో గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి ససేమిరా అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టిన వాళ్లు.. విమర్శించిన వారూ చాలామందే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకునే టీఆర్ ఎస్ తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ ప్రజల తీర్పు తెలుసుకోరా? అంటూ ఉచ్చు విసిరినా కేసీఆర్ రెచ్చిపోలేదు. కూల్ గా ఉంటూనే.. వారి మాటలే తనకు వినపడన్నట్లుగా వ్యవహరించారు. నాడు ఎన్నికలకు పోటీ చేసేందుకు సైతం ధైర్యం చాలని టీఆర్ ఎస్.. ఈ రోజున ఏకంగా 150 డివిజన్లలో 99 డివిజన్లు సొంతం చేసుకోవటం మాటలు కాదు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని నిర్ణయం తీసుకోవటానికి కేసీఆర్ అస్సలు ఇష్టపడరు.
అంతేకాదు.. రాజకీయంగా ప్రయోజనం తక్కువగా ఉంటుందని అర్థమైతే.. ఆట ఆడేందుకు కూడా ఇష్టపడరు. ఓటమితో నిరాశ చెందే కన్నా.. అసలు బరిలోకి దిగకుండా ఉండటానికే ఇష్టపడతారు. ఇలాంటి కారణాలతోనే కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయటానికి సైతం ఇష్టపడలేదు. తనకు బదులు తన కుమారుడ్ని గ్రేటర్ ప్రచార గోదాలోకి దించిన ఆయన.. తనకొడుకు సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించాలనుకున్నారు. తన అంచనాలకు తగ్గట్లే తన కుమారుడు పని చేయటంపై సంతోషించిన ఆయన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో కొడుకును ప్రశంసించి.. తన దగ్గరున్న మున్సిపల్ శాఖను కూడా కేటీఆర్ కు కట్టబెడుతున్నట్లు ప్రకటించారు.
కానీ.. చంద్రబాబు తీరు ఇందుకు పూర్తి భిన్నం. గెలుపు కోసం పోరాడదామని చెబుతూ.. ముందుకు పోవాలనే మాటే తప్పించి వ్యూహాత్మకంగా వ్యవహరించే విషయంలో కేసీఆర్ మాదిరి సునిశితంగా వ్యవహరించరు. గ్రేటర్ లో తాము విజయం సాధించే అవకాశం ఏ మాత్రం లేదన్న విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియంది కాదు. ఆయన వచ్చి రెండు రోజులు ప్రచారం చేసేస్తే.. ప్రజలు ఓట్లు వేసేస్తారని అనుకోవటం కూడా భ్రమే. గెలుపు మీద నమ్మకం ఏమాత్రం లేని సమయంలో.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రచారం చేయటానికి రావాల్సిన అవసరం ఏమిటి?
గెలిచే అవకాశాలు పెద్దగా లేవని తెలిశాక.. ఎవరెంత చెప్పినా బరిలోకి దిగేందుకు కేసీఆర్ ఇష్టపడకపోతే.. అందుకు భిన్నంగా చంద్రబాబు అడుగులేసి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటారు. తాజా ఎపిసోడ్ చూస్తే.. గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయకున్నా నష్టమేమీ ఉండేది కాదు. బాబు ప్రచారం చేసినా.. చేయకున్నా వచ్చే సీట్లు వస్తాయి. రానివి ఎటూ రావు. ఆ విషయం రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారు ఎవరైనా చెబుతారు. అలాంటప్పుడు ప్రత్యేకించి హైదరాబాద్ కు వచ్చి బాబు ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడేమైంది..?
చంద్రబాబు స్వయంగా బరిలోకి దిగిన తర్వాత కూడా గ్రేటర్ పరిధిలో ఒక్కటంటే ఒక్క డివిజన్ మాత్రమే విజయం సాధించటం అంటే.. బాబు పరపతి గ్రేటర్ పరిధిలో ఎంతగా క్షీణించిందో ఇట్టే అర్థమవుతుంది. ఒకవేళ ఆయన కేసీఆర్ తరహాలో ఆలోచించి.. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న పక్షంలో.. ఇప్పుడు ఎదురైన దారుణ ఓటమికి కాసిన్ని సాకులు చెప్పుకునే అవకాశం ఉండేది. బాబు కానీ ప్రచారం చేసి ఉంటే.. ఫలితాలు వేరుగా ఉండేవని చెప్పుకోవటానికి ఛాన్స్ ఉండేది. కానీ.. చంద్రబాబు ఆ అవకాశాన్ని కూడా వదులుకున్నారు. బాబే స్వయంగా ప్రచార గోదాలోకి దిగినా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారన్న విషయం గ్రేటర్ తీర్పుతో స్పష్టమైంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి చంద్రబాబు మైండ్ సెట్ కారణంగానే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. తనది కాని చోట ఆరాటం మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని బాబు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.