ఆంధ్రోడు మర్చిపోలేని రోజు. తన ఆశను.. ఆకాంక్షను వెల్లడించలేని అశక్తతతో ఉండిపోయిన రోజు. తాను ఎన్నుకున్న ప్రభుత్వమే.. పవర్ కత్తిని తన గొంతు మీద ఉంచి.. తనకిష్టం వచ్చినట్లుగా చేసుకుపోయిన రోజు. ప్రత్యేకహోదాపై పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ.. ఎన్నికల వేళ.. ఆంధ్రా లోగిళ్లలో తిరిగి మరీ హామీ ఇచ్చిన మోడీ మాటను మరోసారి గుర్తుకు వచ్చేలా చేయాలనుకున్న ఆంధ్రోడ్ని అవమానకరంగా అడ్డుకున్న రోజు.
తీవ్ర వేదనతో ఆంధ్రుడి ఉండిపోతే.. అధికారంలో ఉన్న చంద్రబాబు ఎక్కడ ఉన్నారో తెలిస్తే కాస్తంత విస్మయానికి గురి కావాల్సిందే. చేతిలో ఉన్న పవర్ తో పోలీసుల్నిఎక్కడికక్కడ మొహరించి.. ఆంధ్రుల్ని.. వారి ఆకాంక్షల్ని తొక్కేసి.. నిలువునా పాతరేసిన చంద్రబాబు.. కులాశాగా విందులో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల కోసం.. వారి బాగు కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానన్న పెద్దమనిషి.. తనలోని నియంతను మరోసారి తెర మీదకు తీసుకొచ్చి.. తన ప్రయోజనాలు తప్పించి ప్రజలు.. వారి బాధలు పట్టవన్న విషయాన్ని బాబు మరోసారి రుజువు చేశారనే చెప్పాలి.
విశాఖలో జరగాల్సిన శాంతి నిరసనను దారుణంగా అడ్డుకొన్న చంద్రబాబు.. తాను మాత్రం రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం ఫంక్షన్ కు హాజరై.. విందును ఎంజాయ్ చేయటం గమనార్హం. తన అకాంక్షల్ని వెల్లడించలేని ఆశకత్తతో అవమానభారంతో ఆంధ్రుడు రగిలిపోతుంటే.. అందుకు భిన్నంగా ఆంధ్రోళ్లు ఇచ్చిన అధికారంతో బాబు మాత్రం..గవర్నర్ గారింట్లో విందును ఎంజాయ్ చేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/