మార్పు మాత్రమే శాశ్వితం. ఈ విషయాన్ని చాలా తక్కువమంది మాత్రమే గుర్తిస్తారు. అవసరానికి తగినట్లుగా మారిపోవటం అనివార్యం. ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆడంబరాలకు.. హడావుడికి ప్రాధాన్యత ఇస్తారని పేరున్న చంద్రబాబులో మార్పు వేగంగా మొదలైందని చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు.. పదేళ్ల విరామం తర్వాత మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేప్టటిన కొద్దికాలం వరకూ విపరీతమైన హడావుడి ప్రదర్శించిన ఆయనలో ఇప్పుడు మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న చిన్న విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు.
హడావుడికి దూరంగా.. హంగామా దరికి చేరకుండా సాదాసీదాగా ఉండలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొత్తల్లో తన చాంబర్ కోసమే దాదాపు రూ.10కోట్లకు పైనే ఖర్చు పెట్టించిన ఆయన.. ఈ విషయంపై చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. కాలం గడిచే కొద్దీ ఆయన మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్నే తీసుకుంటే.. భారీగా చేయాలన్న ఆలోచన నుంచి ఆయన బయటకొచ్చేసి.. హంగామాలను దాదాపుగా తగ్గించేశారు. సింఫుల్ గా ఉంటూనే.. గ్రాండ్ గా కార్యక్రమం జరిగేలా ప్లాన్ చేసిన ఆయన వృధా ఖర్చును చాలావరకూ జరగకుండా అడ్డు పడ్డారనే అభిప్రాయం కలిగేలా చేశారు.
తాజాగా ఆయన తన కాన్వాయ్ ని పూర్తిగా సమీక్షించారు. గత కొద్దిరోజులుగా సీమాంధ్రలో ఉంటున్న ఆయన తన భద్రత కోసం ఏర్పాటు చేసిన కాన్వాయ్ ను దాదాపుగా కనిష్ఠ స్థాయికి తీసుకొచ్చారు. రూల్ బుక్ ప్రకారం దాదాపుగా 23 వాహనాల్ని సీఎం కాన్వాయ్ కిందన ఏర్పాటు చేయాలి. మొదట బ్లూబుక్ లో పేర్కొన్న విధంగా 23 వాహనాల భారీ కాన్వాయ్ నే ఏర్పాటు చేశారు. అయితే.. ఇంత భారీ కాన్వాయ్ కారణంగా ఇబ్బందులతో పాటు.. అనవసరమైన హడావిడి ఎక్కువైందన్న భావన చంద్రబాబుకు కలిగిందని చెబుతారు. విజయవాడ లాంటి చిన్న నగరంలో అంత పెద్ద కాన్వాయ్ అవసరం లేదని భావించిన బాబు.. తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తొమ్మిదికి తగ్గించారు. ప్రస్తుతం కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ ను కూడా త్వరలో తీసేస్తారని చెబుతున్నారు.
విజయవాడలో ఆయన నివాసానికి.. కార్యాలయానికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆసుపత్రులు ఉండటం.. అక్కడ సీఎంకు అవసరమైతే వైద్య సాయానికి అనువుగా ఏర్పాటు పూర్తి చేసిన నేపథ్యంలో అంబులెన్స్ ను తీసివేయాలన్న భావనలో ఉన్నారని చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయం పక్కా అన్న మాట వినిపిస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అవసరమైన పక్షంలో అందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అంబులెన్స్ అవసరం లేదని తేల్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారదర్పాన్ని ప్రదర్శించటానికి ఏ చిన్న అవకాశాన్ని వదలిపెట్టని నేతలున్న వేళ.. చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనించాల్సిన అంశమే.