ఒక హైదరాబాదీ కుర్రాడు సృజనాత్మకంగా ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశారు. ఇలాంటి ప్రయోగాల్ని ప్రమోట్ చేసే అలవాటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకురావటం మంచిది అనుకున్నారో ఏమో కానీ.. అమరావతికి ఈ ప్రత్యేక సైకిల్ ను తీసుకొచ్చారు. హైదరాబాద్ కు చెందిన గయమ రాజ అనే యువకుడు ఈ ఎలక్ట్రికల్ సైకిల్ ను రూపొందించారు.
ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ఎలక్ట్రికల్ సైకిల్ గంటకు25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. అయితే.. రాజ తయారుచేసిన ఈ సైకిల్ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తయారు చేయటం గమనార్హం. సైకిల్ ఉపయోగించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటు.. వేగంగా దూసుకెళ్లే అవకాశం ఉన్న ఈ సైకిల్ ను చూసిన చంద్రబాబు సరదాగా దాని మీద ఎక్కి కాసేపు షికారు చేశారు. సైకిల్ ను సరికొత్తగా రూపొందించిన రాజా ను చంద్రబాబు అభినందించారు.
హైదరాబాదీ కుర్రాడు తయారు చేసిన ఎలక్ట్రికల్ సైకిల్ ను అమరావతికి తీసుకొచ్చి మరీ చంద్రబాబుకు చూపించటం గమనార్హం. కాస్త సరదాగా చెప్పాలంటే.. సరికొత్తగా రూపొందించిన ఎలక్ట్రికల్ సైకిల్ ను.. ‘కారు’ బాస్ కేసీఆర్ చూపించకుండా ‘సైకిల్’ బాస్ చంద్రబాబుకు చూపించటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/