మంత్రులు ప్యాక‌ప్ః ఏపీకి ప్యాకేజీ

Update: 2016-09-06 13:08 GMT
ఊహించిందే జ‌రుగుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అట‌కెక్కింది. ప్ర‌త్యేక ప్యాకేజీ మాత్ర‌మే ద‌క్క‌బోతోంది. అయితే ఈ ఎపిసోడ్‌ పై అప్పుడే రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. పైగా అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఇది ప్రారంభం అవుతోందని తెలుస్తోంది. ప్ర‌త్యేక హోదా బ‌దులుగా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహం సిద్ధం చేశారని స‌మాచారం. అధికారికంగా నిర్ణ‌యం వెలువ‌డ‌న‌ప్ప‌టికీ ఈ మేర‌కు కీల‌క అడుగులు ప‌డుతున్నాయ‌ని స‌మాచారం.

అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న‌  కేబినెట్ భేటీ జ‌రిగింది. ఈ భేటీలో అసెంబ్లీ స‌మావేశాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌కంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లుకు స‌భ‌ ఆమోదం - కేంద్రం ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వ‌స్తున్న ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌ధాన ఎజెండాగా చ‌ర్చ సాగిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌పై ఆచితూచి స్పందించాల‌ని బాబు ఆదేశించిన‌ట్లు స‌మాచారం. కేంద్రం  ఒక‌వేళ ప్యాకేజీ ప్ర‌క‌ట‌న చేస్తే వెంట‌నే స్పందించ‌కుండా...అధ్యయ‌నం చేసిన త‌ర్వాతే మాట్లాడాల‌ని బాబు సూచించారు. అయితే అంత‌కంటే ముందుగా... ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ గురించి కేంద్రం ఏమంటుందో, అందులో ఏఏ అంశాలు ఉన్నాయో, తెలుసుకోవాలని మంత్రులను చంద్ర‌బాబు ఆదేశించారు. ఎక్క‌డా దూకుడు ప్ర‌క‌ట‌న‌లు చేసి ఇర‌కాటంలో ప‌డ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.
..
Tags:    

Similar News