ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఏపీ.. ఇప్పుడు అరాచకాలకు అడ్డాగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన నేరస్థుడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉందని వ్యాఖ్యానించారు. ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.
దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక మార్పులకు టీడీపీ నాంది పలికిందని చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్లలో ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదని ధ్వజమెత్తారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలతో ఈ 40 ఏళ్లలో పోరాడామన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఇలా అయిపోతారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ముఠా కక్షలు, రౌడీలను అణిచివేసింది ఈ పోలీసు వ్యవస్థేనన్న ఆయన... ఇప్పుడు కొందరు పోలీసుల అధికారులు పూర్తిగా గాడి తప్పారని విమర్శించారు. ఇప్పుడు అవినీతి అధికారులకు కీలక పోస్టులు ఇస్తున్నారన్నారు. కరుడుగట్టిన నేరస్థుడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉందని వ్యాఖ్యానించారు.
వివేకా హత్య కేసులో నిందితులు చనిపోతున్నారన్న చంద్రబాబు.. అప్రూవర్గా మారిన దస్తగిరి ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నాడని తెలిపారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐపైనే కేసులు పెట్టిన ప్రభుత్వం ఇదని విమర్శించారు. సీబీఐకే దిక్కులేకపోతే... డ్రైవర్గా ఉండే తన పరిస్థితి ఏంటని దస్తగిరి అడుగుతున్నాడన్నారు. ఒక ఎంపీ(వైసీపీ ఎంపీ రఘురామ) రాష్ట్రానికి రాలేని పరిస్థితిని కల్పించారన్న చంద్రబాబు... ట్రైన్లో వస్తే అతడిని అందులోనే అంతమొందించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవా అని నిలదీశారు.
టీడీపీ మీడియా కోఆర్డినేటర్ నరేంద్రను పోలీసు కస్టడీలో హింసిచే అవకాశం ఉందని.. ముందే అందరికీ లేఖలు రాశామన్నారు. అయినా నరేంద్రను హింసించారని, 'మీరు పోలీసులా? ఉన్మాదులా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టిన వారి పేర్లు కూడా ఉన్నాయన్న చంద్రబాబు.. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. అమరావతిలో రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత తమదేనని తెలిపారు. అలాంటి అమరావతికి నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ సరే అన్నారని.. చిన్న రాష్ట్రం విభేదాలు వద్దని ప్రతిపక్షంలో ఉన్న జగన్ అన్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రుషికొండను బోడికొండ చేసేశారని విమర్శించారు. ఓ పక్క కోర్టులో విచారణ జరుగుతుంటే.. మరో పక్కన తవ్వేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరాన్ని 70 శాతం పూర్తి చేస్తే... దాన్ని ముంచేశారని ఆరోపించారు. ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వితండవాదాలు, రౌడీయిజంతో తప్ప మరొకటి లేదన్నారు. 'నా రాష్ట్రం-నా భవిష్యత్' అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.