ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సింగపూర్ అంటే ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అదేమీ పెద్ద రహస్యం కాదు కాబట్టి! స్వయంగా చంద్రబాబే అభివృద్ధి నుంచి మొదలుకొని రాజకీయపార్టీల వరకు అన్నింటా సింగపూర్ జపం చేస్తుంటారు కనుక!! ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అయితే ఆయన మమకారం వర్ణించలేనిది. అయితే బాబుకు ఈ సింగపూర్ ఆసక్తి తారాస్థాయికి చేరిందని అంటున్నారు. ఆఖరికి ప్రతిపక్షం విషయంలో కూడా బాబు సింగపూర్ ను ఆదర్శంగా తీసుకోవడం ఈ కొత్త చర్చకు కారణం.
ఇంతకీ విషయం ఏంటంటే...అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఇటు పార్టీ ఎమ్మెల్యేలు - అటు టీడీపీ నాయకులతో చంద్రబాబు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కూడా సింగపూర్ ప్రస్తావన తెచ్చారు. సింగపూర్ తరహాలో రాష్ట్రాభివృద్ది కోసం అసెంబ్లీని వేదికగా చేసుకుందామన్నారు. సింగపూర్ లో ప్రతిపక్షం నామమాత్రమేనని ఆయన వివరించారు. సింగపూర్లో పార్లమెంట్ వేదికగా అధికార పక్షం ప్రజా సమస్యలు పరిష్కరిస్తుందని చంద్రబాబు వివరించారు.దీంతో ఇప్పటివరకు అభివృద్ధికి - పరిపాలనకు సింగపూర్ ను తమ నాయకుడు ఆదర్శంగా తీసుకుంటే..ఇప్పుడు ఆఖరికి అసెంబ్లీ సమావేశాలకు కూడా...ప్రతిపక్షాల విషయంలో సింగపూర్ విధానాన్ని ప్రస్తావనకు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని కొందరు నాయకులు చర్చించుకున్నారని అంటున్నారు.
ఇక ఈ సమావేశంలోని ఇతర అంశాల విషయానికి వస్తే...అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఇంటింటికీ టీడీపీ కొనసాగించాలని టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈనెల 26న మంగళగిరి వద్ద పార్టీ కార్యాలయంకు శంకుస్థాపన చేయనున్నట్లు సూత్రప్రాయంగా సీఎం తెలిపారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ ఇంటింటికీ తెలుగుదేశం ద్వారా 96 లక్షల ఇళ్లను చేరుకున్నామని సీఎంతో తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశంలో 45లక్షల అభ్యర్థనలు వచ్చాయని వివరించారు.