ఏపీకి ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రజలు మొదలు.. వివిధ రాజకీయ పార్టీల వారు చేస్తున్న నిరసనలు.. ఆందోళనలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకవిధమైన ఉద్యమ వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఏపీకి జరిగిన అన్యాయంపై ఐదు కోట్ల ఆంధ్రోళ్లు రగిలిపోతున్న పరిస్థితి.
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ విపక్ష ఎంపీలు కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఏపీకి హోదా కోరుకునే అధికారపక్షమే అయితే.. తన వంతు కర్తవ్యంగా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది.
కానీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారమే వేరు. ఓపక్క హోదా కోసం రాష్ట్రం రగిలిపోతున్న వేళ.. అధికారపక్షం సభ్యులతో అమరావతిలోని అసెంబ్లీ సభ్యుల ఆటల పోటీల్ని నిర్వహించారు. క్రీడాపోటీల్ని నిర్వహించాల్సిందే.. కానీ ఎప్పుడు? అన్నది పట్టించుకోకుండా పోటీలు నిర్వహిస్తున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ఓపక్క విపక్ష సభ్యులు సభకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్రంలో ఉద్యమ వాతావరణం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో అవేమీ తమకు పట్టవన్నట్లుగా క్రీడాపోటీలు నిర్వహించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అందరూ కలిసి పాల్గొనే వేళ నిర్వహించాల్సిన పోటీల్ని.. అధికారపక్షం నేతలు మాత్రమే పాల్గొనే వాతావరణంలో నిర్వహించాల్సింది పోయి.. కొద్ది మంది మధ్యన నిర్వహించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ పోటీల్లో ఏపీ మంత్రి పరిటాల సునీత ఓవరాల్ ప్రతిభను ప్రదర్శించారు. మహిళా విభాగంలో షార్ట్ పుట్.. టెన్నికాయిట్ విభాగాల్లో విజేతగా నిలిచారు. ఈసందర్భంగా సహచర మంత్రులు పరిటాల సునీతను అభినందించారు. బాబును ఎవరైనా విమర్శిస్తే.. ఇదైపోతారు కానీ.. ఓపక్క హోదా కోసం విపక్ష నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే.. ఇంకోవైపు అధికారపక్ష నేతలు ఆటలాడుకోవటం.. అభినందనలు తెలుపుకోవటం సబబే అంటారా?