అమరావతి శంకుస్థాపన పిలుపుల విషయంలో తమ నాయకుడికి అవమానం జరిగిందన్నది పవన్ కల్యాణ్ అభిమానుల వాదన. అయితే.. అలాంటిదేమీ లేదన్నది ఏపీ అధికారపక్షం వాదన. ఇదిలా ఉంటే.. శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తాడా? అన్నది ఒక డౌట్ గా మారింది. ఇదే విషయాన్ని పవన్ ను అడిగినప్పుడు తనకు షూటింగ్ ఉందని.. తనకు రావాలని ఉందని.. ప్రయత్నిస్తానని చెప్పారు.శంకుస్థాపన కార్యక్రమానికి హాజరీ విషయంలో పవన్ డౌట్ గా చెబుతుంటే.. ఏపీ మంత్రులు మాత్రం అందుకు భిన్నంగా పూర్తి కాన్ఫిడెంట్ గా ఉండటం గమనార్హం.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి సైతం పవన్ కల్యాణ్ రాకపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తారని తాను బావిస్తున్నట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనకు తాను ఫోన్ చేసి ఆహ్వానించానని చెప్పిన చంద్రబాబు.. రాజధాని భూముల విషయంలో తన సర్కారు వైఖరిని వ్యతిరేకించిన విషయానికి శంకుస్థాపన హాజరుకు సంబంధం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. వ్యతిరేకించినట్లు అవుతుందని భావించకూడదని.. శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2019 నాటికి రాజధానిలోని పరిపాలన కేంద్రం పూర్తి అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. బాబు అనుకుంటున్నట్లుగా పవన్ కల్యాణ్ శంకుస్థాపనకు వస్తారా? అన్నది చూడాలి.