ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భలే సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కేంద్రంగా పరిపాలన చేయాలని భావించి ఈ క్రమంలో ఒకింత ఆలస్యంగా అయిన విజయం సాధించిన చంద్రబాబు తదుపరి అడుగులో తిప్పలు ఎదుర్కుంటున్నారు. ఈ నెల 18న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో ఈ కొత్త చర్చ జరుగుతోంది. మంత్రివర్గ సమావేశాన్ని మొట్టమొదటిసారిగా వెలగపూడి సచివాలయంలో నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో విజయవాడలోనే జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశముంది. అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అదే విధంగా వెలగపూడిలో నిర్ణీత గడువులోగా ప్రస్తుత నిర్మాణాలను పూర్తి చేయించాలనే యోచనలో ప్రభుత్వం వుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో వెలగపూడిలోని నిర్మాణాలపై దిశానిర్దేశం చేసే అవకాశం వుంది. పోలవరం డిజైన్లపై కేబినెట్ లో చర్చించనున్నారు. అక్కడ పనుల పురోగతిని సమీక్షిస్తూనే - ఇటీవల పోలవరంలో క్షేత్రస్థాయిలో నిలిచిపోయిన పనుల పై చర్చించే అవకాశం వుంది. మరోవైపు టూరిజం కల్చర్ బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వపరంగా నిర్ణయం జరిగింది. పర్యాటక రంగానికి ఇతోధికమైన ప్రాధాన్యతను ఇవ్వాలని సంకల్పించిన ప్రభుత్వం జిల్లాల స్థాయిలో పర్యాటక కౌన్సిల్‌లను ఏర్పాటు చేయనుంది. కేబినెట్ భేటీలో ఈ విషయమై స్పష్టత రానుంది. సిఆర్ డిఏ పరిధిలో రాజధానికి సంబంధించి రుణ - ఆర్థిక - నిర్మాణాలపై చర్చ జరిగే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇంతటి ముఖ్యమైన ఎజెండాతో సాగే కేబినెట్ సమావేశాన్ని వెలగపూడిలోనే జరపాలని ముఖ్యమంత్రి ఉత్సాహంగా భావించినప్పటికీ అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో సీఎం క్యాంపు ఆఫీసులోనే నిర్వహించే అవకాశముందని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/