రెబల్స్‌ కే రెబల్‌ చంద్రబాబు

Update: 2019-03-28 17:30 GMT
పోల్‌ మేనేజ్‌ మెంట్‌ లో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఇప్పటివరకు దాదాపు ఆయన 7 ఎన్నికలను దగ్గరుండీ చూశారు. ఎన్నికల్లో ఎలా చేస్తే ఓట్లు పడతాయో - ఓటర్లను ఎలా ఆకర్షించాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరో లీడర్‌ కు తెలీదంటే ఆతిశయోక్తి కాదు. ఇక పార్టీలకు తలనొప్పిగా మారే రెబల్స్‌ ని కంట్రోల్ చేయడంలో చంద్రబాబు వ్యూహాలు అద్భుతంగా ఉంటాయి. సామ - దాన - భేద - దండోపాయాలతో రెబల్స్‌ ని దారిలోకి తీసుకువస్తారు ఆయన. గత 23 ఏళ్లుగా పార్టీలో రెబల్‌ అనే పదమే వినపడకుండా చేశారు చంద్రబాబు. కానీ తొలిసారిగా ఈసారి ఎన్నికల్లో ఎక్కువమంది టీడీపీ రెబల్స్‌ బరిలోగి దిగారు. దీంతో.. తన స్టైల్లో అందర్ని దారిలోకి తీసుకువచ్చారు  చంద్రబాబు.
   
గురువారంతో నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసింది. గడువు ముగిసిలోగా రెబల్‌ అభ్యర్థులు తమ నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే.. ఓట్లు చీలిపోయి అసలైన టీడీపీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉంది. దీంతో.. చంద్రబాబు రెబల్‌ అభ్యర్థులందరితో మాట్లాడారు. తిరుగుబాటు అభ్యర్థులకు నచ్చజెప్పడంతో చాలామంది చంద్రబాబు మాట విని పోటీ నుంచి తప్పుకున్నారు. 12 నియోజక వర్గాలకు చెందిన తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లను గురువారం ఉపసంహరించుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే నియామక పదవులు లేదా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి వాళ్లందర్ని కూల్‌ చేశారు చంద్రబాబు. ఇక నామినేషన్లను ఉపసంహరించుకున్న వారిని ఒకసారి గమనిస్తే.. పుట్టపర్తిలో గంగన్న - మల్లెల జయరామ్‌ - విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోడెల సూర్యలత - తాడికొండలో బెజ్జం సాయిప్రసాద్‌ - చీపురుపల్లి నియోజకవర్గంలో త్రిమూర్తుల రాజు - పలమనేరులో సుభాష్ చంద్రబోష్ - కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి - విశాఖ సౌత్‌ లో మహ్మద్ సాదిక్ - నెల్లూరు రూరల్‌ లో దేశాయశెట్టి హనుమంతరావు - గాజువాకలో లేళ్ల కోటేశ్వరరావు - మాచర్లలో చలమారెడ్డి - రాయదుర్గంలో దీపక్ రెడ్డి - రాజోలులో బత్తుల రాము ఉన్నారు. చంద్రబాబు హామీతో  రెబల్‌ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుని టీడీపీ విజయానికి కృషి చేస్తామని చంద్రబాబుకి హామీ ఇచ్చారు. దీంతో.. పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.



Tags:    

Similar News