ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు తన మిత్రపక్ష - విపక్ష నేతలపై పంచ్ లు వేశారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పోలవరం వివరాలన్నీ ఆన్ లైన్ లో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు పునరుద్ఘాటించారు. ఇప్పటికే గత సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ తోపాటు పవన్ కు చురకలంటించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయమన్న పవన్ డిమాండ్ పై ఆయన స్పందించి ఆయనకింకా ఇలాంటి విషయాలు అర్థం కావన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై `ఇప్పటికే ప్రతీది వివరణాత్మకంగా వెబ్ సైట్ లో ఉంచామన్నారు. మరోమారు కూడా తమ వాళ్లకు చెప్పినట్లు వివరించారు. పది రూపాయల ఖర్చు నుంచి ప్రతిది ఆన్ లైన్ లో పెట్టండి. తద్వారా డిమాండ్ చేస్తున్నవారికి విషయం తెలుస్తుంది అని వివరించాను. వాటిని చూసైనా విజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర రాద్దాంతాలు చేయవద్దు. అలా చేస్తే ప్రజలే సమాధానం చెప్తారు.`` అంటూ చంద్రబాబు వెల్లడించారు. శ్వేతపత్రం అడిగినవాళ్లు వాటిని ఎప్పుడంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చని జనసేనాని పవన్ కల్యాణ్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
కావాలని పోలవరం ప్రాజెక్టు వ్యయంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త భూసేకరణ విధానం నష్టపరిహార చెల్లింపు వ్యయం 11రెట్లు పెరిగిందని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు మూడువేల కోట్లున్న పునరావాస వ్యయం 33వేల కోట్లకు చేరుకుందన్నారు. సుమారు 2లక్షల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇంకా 95,818 కుటుంబాలకు ఇంకా పరిహారం చెల్లించాలని చంద్రబాబు అన్నారు. ఒక్కొక్కరికీ 17నుంచి 18లక్షల వరకు చెల్లించాల్సొస్తోందన్నారు. నిబంధనల మేరకు ఆర్ ఆర్ ప్యాకేజీ కింద ఈ మొత్తాలు చెల్లిస్తున్నామన్నారు. కొత్త చట్టం మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలా అక్కర్లేదా అంటూ ఆయన ప్రతిపక్షాల్ని నిలదీశారు.