అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ అనేది అందరికీ తెలిసిందే. దాన్ని ఐదేళ్ల కిందటే అమలు చేయాలనే విషయం కూడా అందరి అవగాహనలో ఉన్నదే. అయితే తమ పాలన ఐదేళ్లు పూర్తి అయ్యాకా - ఆ హామీని తమ హయాంలో అమలు చేయలేక చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు ఆ హామీని అమలు చేయాలంటూ ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉండటం ప్రహసనంగా మారింది.
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్ ను చేస్తూనే ఉన్నారు. మిగతా తెలుగుదేశం నేతలు కూడా ఈ డిమాండ్ ను అందుకున్నారు. రైతు రుణమాఫీని అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేసేస్తూ ఉన్నారు!
రుణమాఫీ అమలు అనేది తెలుగుదేశం పార్టీ చేసిన సవాల్! 2014 ఎన్నికల ముందు ఈ హామీని టీడీపీ ఇచ్చింది. అయితే అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో స్పందించింది. రుణమాఫీ అమలు సాధ్యం కాదని అప్పుడే జగన్ చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
ఆ హామీ తెలుగుదేశం పార్టీకి ఐదు సంవత్సరాల అధికారాన్ని ఇచ్చింది. అయినా ఆ హామీ మాత్రం అమలు కాలేదు! దశలవారీగా అంటూ చంద్రబాబు నాయుడు మూడు విడతల్లో కొద్ది మందికి మాత్రమే మాఫీ చేయగలిగారు. ఇప్పుడు ఆయన ఆ హామీ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
దాన్ని అమలు చేయాలంటూ తాము ఒత్తిడి చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రభుత్వం మారిందని రుణమాఫీని పక్కన పెట్టడానికి లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారట. ఇప్పుడప్పుడే చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ ఆ డిమాండ్ ను పక్కన పెట్టేలా లేదని పరిశీలకులు అంటున్నారు!