టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల వ్యూహం రచించడంలో దిట్టగానే పేరుంది. బాబు వ్యూహాలను ప్రస్తావించాలంటే... ఈ ఒక్క మాట సరిపోదేమో. ఎన్నికల వ్యూహాల రచన - అమలులో బాబు తర్వాతే ఎవరైనా అంటే సరిపోతుందేమో. నిజమే బాబును చాలా దగ్గరగా చూసిన వారితో పాటు బాబు మార్కు పాలనను గమనిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అంతగా కొత్తేమీ కాదు. ఎన్నికల దాకా చాలా నింపాదిగా కనిపించే చంద్రబాబు... ఎన్నికలు సమీపిస్తున్నాయంటే... ఒక్కసారిగా జూలు విదిలిస్తారు. తన బుర్రకు పదును పెట్టి సరికొత్త వ్యూహాలకు పదును పెట్టేస్తారు. ఆ క్రమంలో తెర మీదకు వచ్చే వ్యూహాలతో చంద్రబాబు ముందు ఎంతటి రాజకీయ ఉద్ధండులైనా తలకిందులు కావాల్సిందే. గడచిన ఎన్నికల్లో సర్వేలన్నీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అధికారం అని కోడై కూసినా.. చివరి నిమిషంలో తనదైన వ్యూహాలను అమలు చేసిన చంద్రబాబు... జగన్ గెలుపు అవకాశాలను లాగేసుకున్నారు.
ఇదంతా గతం అనుకుంటే... ప్రస్తుతం కూడా ఇప్పటిదాకా వెలువడిన సర్వేలన్నీ కూడా జగన్ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీ అనుకూల సర్వేలను మినహాయిస్తే... మిగిలిన అన్ని సర్వేల మాట కూడా ఇదే. ఈ సర్వేలపై తనదైన కామెంట్లు చేస్తున్న చంద్రబాబు... వాటిలోని వాస్తవాలను కూడా గమనిస్తున్నారనే చెప్పాలి. ఆ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్‌కు అధికారం అందకుండా ఉండటంతో పాటు తానే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఏమేం చేయాలన్న విషయాలపై బాబు బాగానే కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన కొత్త పథకాలకు తెర తీశారు. ఈ పథకాలు జగన్ నోట నుంచి వెలువడినవే అయినప్పటికీ... బాబు ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. ఇప్పటికే పింఛన్ల సొమ్మును రెట్టింపు చేసిన చంద్రబాబు... ఆటోలు, ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేశారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరిట రూ.10వేలు విడుదల చేస్తున్నారు.
ఇక తాజాగా బీపీ - షుగర్ పేషంట్లకు కూడా బాబు వరాలు ప్రకటించారు. బీపీ - షుగర్ పేషంట్లకు ఉచితంగా మందులు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ఇటీవలే చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకంలో రోగులకు ప్రైవేటు మెడికల్ షాపుల నుంచి ఉచితంగా మందులను పంపిణీ చేస్తారట. త్వరలోనే ఈ పథకం కూడా అమల్లోకి రానుంది. ఇవే కాకుండా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేనాటికి మరిన్ని కొత్త పథకాలను చంద్రబాబు ప్రకటించనున్నట్లుగా సమాచారం. అయినా ఈ కొత్త పథకాల ద్వారా చంద్రబాబు ఏం ఆశిస్తున్నారన్న విషయానికి వస్తే... ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తమపై ఎంతోకొంత ప్రజా వ్యతిరేకత ఉండటం వాస్తవమే కదా. అందులోనూ నిధుల లేమి కారణంగా పెద్దగా అభివృద్ది కార్యక్రమాలు కూడా చేపట్టలేని పరిస్థితుల్లో ఈ వ్యతిరేకత శాతం కాస్తంత అధికంగానే ఉండే అవకాశాలున్నాయి.
ఈ వాస్తవాన్ని గుర్తించిన చంద్రబాబు... తమపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాలకు తెర తీశారని చెప్పాలి. ఇప్పటిదాకా ప్రకటించిన పథకాల్లోని పెన్షన్ల సొమ్ము పెంపు ద్వారా 2 శాతం, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ద్వారా మరో 2 శాతం - బీపీ - షుగర్ ఉచిత మందుల ద్వారా 1 శాతం వ్యతిరేకతను తగ్గకపోతుందా? అన్నది బాబు భావన. మొత్తంగా ఈ మూడు పథకాలతోనే ఓ 5 శాతం ఓట్లను తిప్పేసుకోవచ్చన్నది బాబు భావన. ఎన్నికల్లో తమకూ - వైసీపీకి కూడా ఇంతకంటే పెద్దగా తేడా ఏమీ ఉండకపోవచ్చని కూడా చంద్రబాబు లెక్కలేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే వర్కవుటైతే.. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీదే అధికారం. అయితే బాబు మార్కు రాజకీయాలను చాలా కాలం నుంచి చూస్తున్న ప్రజలు... ఈ దఫా బాబు జిమ్మిక్కులకు పడిపోతారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎన్ని అనుమానాలు ఉన్నా.. బాబు మాత్రం తనదైన శైలి వ్యూహాలను అమలు చేసుకుంటూ పోతున్నారు. ఈ వ్యూహాలు చంద్రబాబుకు ఏ మేర కలిసి వస్తాయో చూడాలి.