చంద్రబాబు.. ఏందీ ఖర్చులు..?

Update: 2015-07-25 12:44 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఖర్చులు ఏపీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నివాసం గోలేమిటో కానీ.. అందుకు కోసం పెడుతున్న ఖర్చు భారీగా ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటంతో.. అటు హైదరాబాద్ లో ఇటు.. ఏపీలోనూ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం.. అందుకోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్న తీరు విమర్శలకు గురి చేసేలా ఉంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అయినా.. కాస్త ఆచితూచి ఖర్చులు పెడితే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. చేతికి ఎముక అనేది లేనట్లుగా ఖర్చు చేయటంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి.

ఒక లెక్క ప్రకారం.. చంద్రబాబు నివాసం కోసం అటు హైదరాబాద్.. ఇటు ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఇళ్ల కోసం పెడుతున్న ఖర్చు లెక్క చూస్తే..

= తాత్కలిక నివాసం.. క్యాంపు కార్యాలయం.. ఇలా పేర్లు ఏమైనా గడిచిన 15 నెలల్లో పెట్టిన ఖర్చు సుమారు రూ.100కోట్లు ఉంటుందన్నది ఒక అంచనా.

= ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్ లో సీఎం అధికారిక నివాసానికి (అధికారిక సమాచారం లేదు) తగినంత విద్యుతు కోసం.. విద్యుత్తు సబ్ స్టేషన్.. సెల్ ఫోన్ టవర్లు.. రహదార్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.

= విద్యుత్ సబ్ స్టేషన్ కోసం రూ.5కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక అంచనా.

= ఇక సెల్ ఫోన్ టవర్లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి రెండు సెల్ టవర్లు ఏర్పాటు చేశారని.. ఇందుకోసం రూ.1.5కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

= రహదారుల నిర్మాణానికి రూ.48 కోట్లు..

= భద్రత చర్యలకు రూ.5కోట్లు

= అతిధి గృహం మరమ్మత్తులకు.. సామాగ్రికి రూ.6కోట్ల వరకు ఖర్చు అని చెబుతున్నారు.
Tags:    

Similar News