ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మళ్లీ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఆర్నెళ్లుగా ఆయన ప్రధాని మోదీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 2012 నుంచి మోదీకి ఎన్నికల వ్యవహారాల్లో సేవలంచింది.. 2014లో మోదీ ప్రధాని కావడానికి అన్ని రకాల వ్యూహాలు రచించి ఆ ఎన్నికల్లో విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ఏపీలో విపక్షం వైసీపీకి ఎన్నికల సలహాదారుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఆయన సేవలను వినియోగించుకునేందుకు బీజేపీ అధిష్ఠానం ఆయన్ను సంప్రదించిందని తెలుస్తోంది.
2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆ తర్వాత అమిత్ షా తో వచ్చిన విభేదాల కారణంగా బిజెపికి దూరమయ్యారు. అంతేకాదు.. బీహార్లో మోదీ టీం ఓటమికి కారణమయ్యారు. అయితే... ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ లకు పనిచేయగా... అక్కడ మాత్రం మోదీ మళ్లీ తన మాయాజాలం చూపించి ప్రశాంత్ కిశోర్ ఎత్తులను చిత్తు చేశారు. ఆ తరువాత ప్రశాంత్ కిశోర్ ఏపీ బాట పట్టారు. జగన్ ఆయన్ను హైర్ చేసుకున్నారు. కానీ, నంద్యాల ఉప ఎన్నికలో ప్రశాంత్ ఎత్తుగడలు చంద్రబాబు ధనం - అధికారం ముందు పనిచేయలేదు.
అయితే.. ఓవరాల్ గా విజయాలు - పరాజయాలు రెండూ ఉన్నా కూడా ప్రశాంత్ కిశోర్ సామర్థ్యాలు గురించి బాగా తెలిసి ఉండడంతో మోదీ మళ్లీ ఆయన్ను పిలిపించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కాదన్న అమిత్ షాయే స్వయంగా ఫోన్ చేసి పిలవడంతో కొన్ని నెలల కిందట ఆయన మోదీ - అమిత్ లతో భేటీ అయ్యారని.. గత ఆర్నెళ్లుగా వారు ప్రశాంత్ కిశోర్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలలో తమతో కలిసి పనిచేయాలని అమిత్ - మోదీలు ఆహ్వానించడంతో, ప్రశాంత్ కిశోర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదంతా బాగానే ఉన్నా ఏపీలో ప్రతిపక్షమైన వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ ను బీజేపీ ఇప్పుడు మళ్లీ ఉపయోగిస్తే తనకు నష్టమని చంద్రబాబు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రశాంత్ కిశోర్ విషయంలో ఓపెనయితే ఈ విషయం ఆ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి తేల్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.