ప్రత్యర్థుల్ని దెబ్బ తీయాలంటే అవకాశం కోసం కాచుకొని కూర్చోవాలి. ఒకసారి ఛాన్స్ దక్కితే చాలు ఇక వదలకూడదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు కూడా ఇప్పుడిలానే ఉంది. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిన బాబు.. ఈ రోజు మాత్రం అందుకుభిన్నంగా మోడీ పరివారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన.. అక్కడి స్థానికుల్లో భావోద్వేగాన్ని రగల్చేలా మాట్లాడటం గమనార్హం. ఆ మధ్యన తమిళనాడులో కూడా ఇలానే వ్యవహరించారని.. ఇప్పుడు కర్ణాటక విషయంలోనే ఇలానే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎపిసోడ్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి అన్నట్లు మోడీపై విమర్శించేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటే.. అందుకు భిన్నంగా బాబు మాత్రం చెలరేగిపోతున్నారు.
ఇటీవల కాలంలో మోడీషాలపై ఈస్థాయిలో విరుచుకుపడింది బాబు అనే చెప్పాలి. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. కేంద్ర సర్కార్ దారుణమైన విధానాల్ని అనుసరిస్తోందన్నారు. మోజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకై మోడీ పరివారం చేస్తున్న ప్రయత్నాలు సరికాదన్న ఆయన.. గతంలో తమిళనాడులో కుట్రలు చేశారన్నారు.
ఇప్పుడు కర్ణాటక విషయంలో కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రత్యక్ష ఎన్నికల ముందు వివిధ వేదికల మీద మాట్లాడిన మోడీ.. అమిత్ షాలు.. తమ మాటలకు భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. వారు దేశానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నట్లు అంటూ తప్పు పట్టారు. దేశానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు? దేశాన్ని ఉద్దరిస్తామని మాటలు చెప్పిన నాయకులు ఇప్పుడేం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కర్ణాటక.. తమిళనాడులలో గవర్నర్ వ్యవస్థను నాశనం చేశారన్న చంద్రబాబు.. మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
+ కేంద్రం ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు ఏపీ రాజధానికి ఇవ్వడం సరికాదు.
+ అనుకున్న రీతిలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే.. పన్నులు ఎక్కువగా కేంద్రానికే వెళ్తాయి.
+ రాజధానిపై విమర్శలు చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదు.
+ ఆర్నెల్ల వ్యవధిలో అమరావతికి ఒక రూపు వస్తుంది.
+ త్వరలోనే అమరావతి బాండ్లు ఇష్యూ చేస్తాం..
+ అమరావతి నిర్మాణం కోసం తక్కువ వడ్డీ దొరికే చోటు రుణాలు తీసుకుంటాం.
+ రాష్ట్రంలో అలజడులు సృష్టించటానికి కొందరు కుట్రలు పన్నుతున్నారు.
+ శాంతిభద్రతల విషయంలో తేడా జరిగేలా కుట్రలు పన్నితే మక్కెలు ఇరగదీస్తా.
+ శాశ్వత అసెంబ్లీ - సెక్రటేరియేట్ - హైకోర్టు నిర్మాణ పనులను త్వరగానే మొదలుపెడతాం.
+ ఇప్పటికే 24 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచాం.
+ లేనిపోని విమర్శలు చేయటం సరికాదు.