రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల్ని పరిష్కరించే క్రమంలో సంప్రదాయాన్న పక్కన పెట్టి.. రోటీన్ కు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ తానే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వద్దకు బయలుదేరిన ఉదంతం తెలిసిందే. ముందుగా అనుకున్నట్లే.. గవర్నర్ ఏపీకి వెళ్లటం..రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జలవివాదం.. హైకోర్టు విభజన.. 9.. 10 షెడ్యూళ్లలో పరిష్కారం కాని అంశాలకు సంబంధించిన చర్చ జరగినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదయం(గురువారం) మరోసారి భేటీ సందర్భంగా ఈ అంశాల మీద మరింత చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఏపీకి వచ్చిన గవర్నర్ కు మర్యాదపూర్వకంగా ఏపీ ముఖ్యమంత్రి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 15 రకాల శాఖాహార వంటకాల్ని వండించిన ఆయన కొసరి కొసరి తినిపించినట్లుగా చెబుతున్నారు. మొదటి రోజు గవర్నర్ పర్యటనను చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గవర్నర్ నరసింహన్ మధ్య జరిగిన చర్చలు తక్కువనే చెప్పాలి. ఇక.. విందు సందర్భంగా గవర్నర్ మనసు దోచుకునేలా వంటలు చేయించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. గవర్నర్ కు కొన్ని వంటకాల్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఆయనకు ఇచ్చారు. ఇక.. గవర్నర్ కు ఎంతో ఇష్టమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అందించారు.
గవర్నర్ కు వడ్డించేందుకు బాబు సిద్ధం చేయించిన మెనూ చూస్తే..
క్యారట్ బొబ్బట్లు - గారె - పూర్ణం - బూరె - పచ్చి శనగ పప్పు గోంగూర వేపుడు - టమాటా గోంగూర పచ్చడి - ఆంధ్రా గోంగూర పచ్చడి - దొండకాయ - బీరకాయ రోటి పచ్చడి - కాలీప్లవర్- బంగాళాదుంప కూర్మా - మిక్స్ డ్ వెజ్ కూర - ఉలవచారు - గుమ్మడి ఒడియాలు - వూర మిరపకాయలు - వెన్నపూస - పెరుగు తదితర వంటకాలు
గవర్నర్ కు కానుకగా ఇచ్చిన పిండి వంటలు చూస్తే..
కాకినాడ కాజా - అరిసెలు - మినప సున్నుండలు - రసగుల్లా - బందరు లడ్డు - కజ్జికాయలు - పూతరేకులు.