బాబుపై చెప్పులు..క్యాష్ చేసుకుంటున్నాడు!

Update: 2019-11-30 12:21 GMT
రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. వైస్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్ పై ఇదే చంద్రబాబు చెప్పులేసిన వైనం టీడీపీ చరిత్రలోనే ఓ మాయని మచ్చ.. దాని వెనుక చంద్రబాబే ఉండడం యాధృశ్చికంగా జరిగింది.

ఇక మొన్నటికి మొన్న సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తిరుమలకు వచ్చిన అమిత్ షాపై తెలుగు తమ్ముళ్లు రాళ్లు వేశారు. బీజేపీతో అప్పుడు కయ్యానికి కాలుదువ్విన చంద్రబాబే ఇదంతా చేయించాడని బీజేపీ వాళ్లు ఆరోపించారు. చంద్రబాబు ఇంత  అవమానించినా అమిత్ షా మాత్రం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదు.

ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చేసింది. 2014లో గద్దెనెక్కిన బాబు అమరావతిని కడుతానని నమ్మించి గ్రాఫిక్స్ మాయజాలం చూపించి రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకున్నారు. ఐదేళ్లలో రాజధానిని కట్టలేకపోయారు. ఇప్పుడు అదే ప్రాంతానికి చంద్రబాబు వస్తే రైతులు ఎదురు తిరిగారు.. తాజాగా పర్యటనలో ఆయనపై చెప్పులేశారు.

అయితే పైన మూడు సందర్భాల్లో అప్పుడు చెప్పులేసినందుకు నాడు ఎన్టీఆర్ పోరుబాట పట్టలేదు. ఇక అమిత్ షా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చర్యలు చేపట్టలేదు.కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం పోరుబాట పడుతున్నారు.

తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తనపై చెప్పులేయించిన వైనాన్ని పార్లమెంటులో ప్రస్తావించి ఎండగట్టాలని.. ఆందోళన చేయాలని చంద్రబాబు తాజాగా తన ఎంపీలకు హుకూం జారీ చేశారు. రాజధాని అమరావతిలో పర్యటన, బస్సుపై చెప్పలతో దాడి తదితర అంశాలపై పార్టీ సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు శనివారం సాయంత్రం అమరావతిలో సమావేశమై ఎంపీలను పార్లమెంట్ లో ఆందోళన చేయాలని ఆదేశించారు.

ఇలా మన బాబు తనపై చెప్పులు వేయించిన వైనాన్ని కూడా ఆందోళనగా మార్చి సింపతి తెచ్చుకునే ప్రయత్నాలను చేస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.


Tags:    

Similar News