అటు ఏపీ అసెంబ్లీలోనూ - మరోవైపు ఢిల్లీలోనూ చట్ట సభల్లో తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేయడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిన నేపథ్యంలో శాసరససభా పక్ష నేత - పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి అయ్యింది.
ముందుగా ఈ సారి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించరని వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నేతగా మరొకరికి చంద్రబాబు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ జరగలేదు. చంద్రబాబు నాయుడే ఆ పదవిని తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు ఈ సారి అసెంబ్లీలో తమ పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ పదవిని ఆయనే తీసుకున్నారు.
ఇక తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ నే ఎన్నుకుంది ఆ పార్టీ. ఈయన కూడా చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన వారనే సంగతి తెలిసిందే.విశేషం ఏమిటంటే.. రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజికవర్గం నేతే అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలకు సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు.
ఇలా అసెంబ్లీ - రాజ్యసభ - పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉన్న వేళ తెలుగుదేశం పార్టీలో ఈ తీరు మారాల్సిందేమో అని పరిశీలకులు అంటున్నారు!