మాజీ మంత్రి రావెలకిషోర్‌బాబుకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. సీఎం అడిగిన అనూహ్యమైన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రావెల నీళ్లు నమిలారు. చివరకు ఆ షాక్ నుంచి తేరుకొని ఏదో సమాధానం చెప్పి బాబును కూల్ చేసేందుకు ప్రయత్నించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ నిర్వహించిన కురుక్షేత్రసభ విషయం చర్చకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తనకు తెలంగాణే ముఖ్యమని మందకృష్ణమాదిగ ప్రకటించారని ఎమ్మెల్యే అనిత అన్నారు. అటువంటిది, ఇప్పుడు ఏపీకి వచ్చి పోరాటాలు, ఆందోళనలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంలో మాజీమంత్రి రావెల కిషోర్ బాబు జోక్యం చేసుకొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో మందకృష్ణను రాష్ట్రంలోకి రాకుండా చేసినట్టు చెప్పారు.
మాదిగల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాప్రభుత్వంపై మందకృష్ణ విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. ఈ సందర్భంలో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొన్నారు. ఇప్పుడేమో మీరు మందకృష్ణను ఇంట్లోనే పెట్టుకొన్నారుగా అని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో రావెల ఖంగు తిన్నారు.
మీ ఇంట్లోనే కదా మందకృష్ణమాదిగ బస చేసిందని రావెలను సీఎం ప్రశ్నించారు. తమ అధినేతనుంచి ఊహించని ప్రశ్న ఎదురవడంతో సమాధానం చెప్పడానికి తటపటాయించారు. సీఎం ప్రశ్నకు ఏం బదులివ్వాలో రావెలకు అర్థం కాలేదు. కొద్ది సమయం తర్వాత ఆయన తేరుకొన్నారు. చందాల కోసం మందకృష్ణ తన ఇంటికి వచ్చిపోతుంటాడని రావెల చెప్పారు. అయితే మందకృష్ణ బస చేసిన ఇల్లు రావెలకిషోర్‌బాబుదని సీఎంకు ఎలా తెలిసిందని నేతలు చర్చించుకొన్నారు.